జాతీయ మహిళ కమిషన్ చైర్మన్గా లలిత
న్యూఢిల్లీ: జాతీయ మహిళా కమిషన్ కొత్త చైర్మన్గా లలితా కుమారమంగళం నియమితులయ్యారు.కేంద్ర మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ లలిత నియామకాన్ని ప్రకటించారు.
బుధవారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించి వంద రోజులు పూర్తయిన సందర్భంగా మేనకా గాంధీ ఈ సమావేశం ఏర్పాటు చేశారు.