Land acquisition work
-
భూసేకరణ పనులు వేగవంతం చేయాలి
కలెక్టర్ వాకాటి కరుణ హన్మకొండ అర్బన్ : జిల్లాలో ప్రాజెక్టుల కోసం అవసరమైన భూసేకరణ త్వరిత గతిన పూర్తి చేయాలని కలెక్టర్ వాకాటి కరుణ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూసేకరణలో జాప్యం జరగకుండా రైతులు పాస్‌పుస్తకాలు, పట్టాలో ఉన్న రైతుపేరు, కాస్తులో ఉన్న రైతుల పేరు, అసైన్డ్ భూములు, రికార్డుల్లో ఉన్న పొరపాట్లు సరిదిద్దాలని ఆదేశించారు. జాప్యానికి కారణాలు గుర్తించి సత్వరం పరిష్కరించాలని అన్నారు. ఈ సందర్బంగా రికార్డుల్లో తప్పులు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు కలెక్టర్ బోర్డుపై రాస్తూ అధికారులకు వివరించారు. మొత్తంగా రెండు వారాల్లో భూసేకరణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సమవేశంలో డిప్యూటీ కలెక్టర్లు, జనగామ ఆర్డీఓ వెంకట్‌రెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు. హరితహారం మొక్కల సంరక్షణకు ప్రాధాన్యం జిల్లాలో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. మంగళ వారం హైదరాబాద్ నుంచి అటవీ,పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్బీ మీనా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరె¯Œ్స నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 4.37కోట్ల మొక్కల నాటినట్లు తెలిపారు. త్వరలో 4.50 కోట్ల లక్ష్యం చేరుకుంటామని ఆమె చెప్పారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా చర్యలు తీసుకుంటన్నామన్నారు. జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ 98 శాతం పూర్తయిందని, త్వరలో మిగతాపనులు పూర్తి చేస్తామని అన్నారు. జేసీ ప్రశాంత్ జీవ¯ŒSపాటిల్, డీఎఫ్‌వో శ్రీనివాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
భూ సేకరణ పనులు వేగంవంతం
ఇన్చార్జి కలెక్టర్ ఎం రాంకిషన్ మహబూబ్‌నగర్ న్యూటౌన్: జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు యుద్ధప్రాతిపదికన భూసేకరణ పనులు పూర్తి చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎం రాంకిషన్ అధాకారులను ఆదేశించారు. మంగళవారం జేసీ క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. భూసేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులను ఎదుర్కోవడం, అనుసరించాల్సిన విధానాలను వివరించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను అధికారులు జేసీకి వివరించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించిందని భూసేకరణ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టు వారీగా భూసేకరణ వివరాలపై చర్చించారు. ఈ సమావేశంలో భూసేకరణ స్పెషల్ కలెక్టర్ వనజాదేవి, సర్వే ల్యాండ్స్ ఏడీ శ్యాంసుందర్‌రెడ్డి, కేఎల్ఐ, జూరాల ఎస్ఈలు, ఆర్డీఓలు పాల్గొన్నారు. -
ప్రాజెక్టుల భూసేకరణ పనులు పూర్తి చేయాలి
కలెక్టర్ వాకాటి కరుణ హన్మకొండ : నీటి పారుదల ప్రాజెక్టుల కోసం అవసరమైన భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం సాయంత్రం జనగామ డివిజన్ పరిధిలోని స్టేషన్‌ఘన్‌పూర్, నష్కల్, చెన్నూర్, పాలకుర్తి, గండి రామారం, అశ్వరావుప ల్లి రిజర్వాయర్ల నుంచి సాగునీ టి కాల్వల నిర్మాణానికి కావల్సిన భూ సేకరణ పనుల పురోగతిపై సంబంధిత స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, వీఆర్ఓలు, ప్రాజెక్టుల ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటివరకు 3,920 ఎకరాల భూమిని నెగోషియేషన్ చేయడం జరిగిందని, వీఆర్ఓలు ఏప్రిల్ 6వ తేదీ నాటికి లోకల్ ఎంక్వయిరీ పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి ఏ గ్రామంలో.. ఏ సర్వే నంబర్ భూమిని వినియోగించుకోవాలనుకుంటారో అక్కడ గ్రామసభ ఏర్పాటు చేసి సర్పంచ్‌ను, భూ యజమానులను పిలిపించి ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాన్ని వివరించాలన్నారు. తహసీలార్ల సేవలను వినియోగించుకోవాలి.. వీఆర్ఓలు పూర్తి నివేదిక అందజేసిన తర్వాత ఆర్ఐ, డి ప్యూటీ తహసీల్దార్ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారపి కలెక్టర్ చెప్పారు. గ్రామాలు, మండలాల వారీగా ఎంత భూమి లభ్యంగా ఉందో ఎంపిక చేసుకోవాలని, ఇందు కు అనుభవజ్ఞులైన తహసీల్దార్ల సేవలు వినియోగించుకోవాలన్నారు. ఇప్పటి వరకు జరిగిన 3,269 ఎకరాలు నెగోషియేషన్ కాగా.. ఆ మేరకు ఫారం-2 క్లెయిమ్ కా లేదని, ఏప్రిల్ 9వ తేదీ వరకు ఈ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. జేసీ ప్రశాం త్ జీవన్‌పాటిల్, స్పెషల్ కలెక్టర్ డేవిడ్, ఆర్డీఓలు వెంకటమాధవరావు, వెంకటరెడ్డి, ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు, వీఆర్ఓలు పాల్గొన్నారు.