ప్రాజెక్టుల భూసేకరణ పనులు పూర్తి చేయాలి
కలెక్టర్ వాకాటి కరుణ
హన్మకొండ : నీటి పారుదల ప్రాజెక్టుల కోసం అవసరమైన భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం సాయంత్రం జనగామ డివిజన్ పరిధిలోని స్టేషన్‌ఘన్‌పూర్, నష్కల్, చెన్నూర్, పాలకుర్తి, గండి రామారం, అశ్వరావుప ల్లి రిజర్వాయర్ల నుంచి సాగునీ టి కాల్వల నిర్మాణానికి కావల్సిన భూ సేకరణ పనుల పురోగతిపై సంబంధిత స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, వీఆర్‌ఓలు, ప్రాజెక్టుల ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటివరకు 3,920 ఎకరాల భూమిని నెగోషియేషన్ చేయడం జరిగిందని, వీఆర్‌ఓలు ఏప్రిల్ 6వ తేదీ నాటికి లోకల్ ఎంక్వయిరీ పూర్తి చేయాలన్నారు.
ప్రాజెక్టుకు సంబంధించి ఏ గ్రామంలో.. ఏ సర్వే నంబర్ భూమిని వినియోగించుకోవాలనుకుంటారో అక్కడ గ్రామసభ ఏర్పాటు చేసి సర్పంచ్‌ను, భూ యజమానులను పిలిపించి ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాన్ని వివరించాలన్నారు.
తహసీలార్ల సేవలను వినియోగించుకోవాలి..
వీఆర్‌ఓలు పూర్తి నివేదిక అందజేసిన తర్వాత ఆర్‌ఐ, డి ప్యూటీ తహసీల్దార్ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారపి కలెక్టర్ చెప్పారు. గ్రామాలు, మండలాల వారీగా ఎంత భూమి లభ్యంగా ఉందో ఎంపిక చేసుకోవాలని, ఇందు కు అనుభవజ్ఞులైన తహసీల్దార్ల సేవలు వినియోగించుకోవాలన్నారు. ఇప్పటి వరకు జరిగిన 3,269 ఎకరాలు నెగోషియేషన్ కాగా.. ఆ మేరకు ఫారం-2 క్లెయిమ్ కా లేదని, ఏప్రిల్ 9వ తేదీ వరకు ఈ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. జేసీ ప్రశాం త్ జీవన్‌పాటిల్, స్పెషల్ కలెక్టర్ డేవిడ్, ఆర్డీఓలు వెంకటమాధవరావు, వెంకటరెడ్డి, ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు, వీఆర్‌ఓలు పాల్గొన్నారు.