land tress passes
-
ఏపీ మాజీమంత్రి పత్తిపాటి సతీమణిపై ఫిర్యాదు
బంజారాహిల్స్: ఏపీ మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు సతీమణి తేనె వెంకాయమ్మపై భూకబ్జాకు సంబంధించి జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి ఎ.మురళీముకుంద్ పోలీ సులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 44లో తమ సొసైటీకి చెందిన భూమిని కబ్జా చేశారని జూబ్లీహిల్స్ పోలీసులకు ఆదివారంరాత్రి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్లాట్ నంబర్ 853/ఎఫ్‌లోని 1,519 గజాల స్థలంపై కొంతకాలంగా వివాదం నడుస్తోందని, అది తమదేనంటూ వెంకాయమ్మ వాదించడమే కాకుండా ఆమె అనుచరులు సొసైటీకి చెందిన బోర్డును కూడా తొలగించారని ఆరోపించారు. బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తూ స్థలాన్ని కబ్జా చేసేందుకు వెంకాయమ్మ, ఆమె అనుచరులు ప్రయత్నిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకో వాలని ఆయన కోరారు. అక్రమంగా ఈ ప్లాట్ పొందిన సీహెచ్ శిరీష దీనిని పి.శ్రీహరికి గిఫ్ట్ డీడ్ చేశారని, మళ్లీ శ్రీహరి 2020 డిసెంబర్ 31న ఎల్లోస్టోన్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్‌గా ఉన్న పత్తిపాటి వెంకాయమ్మకు ఏజీపీఏ చేసినట్లు తెలుస్తున్నదని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్లాట్ వ్యవహారం అటు న్యాయ స్థానం లోనూ, ఇటు జూబ్లీహిల్స్ పోలీసుల విచారణలో ఉండగా తాజాగా వెంకాయమ్మ రంగప్రవేశంతో మరింత ఆసక్తికరంగా మారింది. -
మాజీమంత్రి ఈటలపై మరో దర్యాప్తు
సాక్షి, హైదరాబాద్: మాజీమంత్రి ఈటల రాజేందర్‌పై మరో భూకబ్జా ఫిర్యాదు రావడంతో దర్యాప్తుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రాజేందర్ కుమారుడు నితిన్‌రెడ్డి తన భూమిని కబ్జా చేశారనీ, తనకు న్యాయం చేయాలని మేడ్చల్ మండలం రావల్కోల్ గ్రామానికి చెందిన పీట్ల మహేశ్ ముదిరాజ్ ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్‌ను సీఎం ఆదేశించారు. ఏసీబీ, విజిలెన్స్, రెవెన్యూ విభాగాలు సమగ్ర దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని సీఎం సూచించారు. ఈటల బెదిరించారని ఫిర్యాదు సర్వే నంబర్ 77లోని 10.11 ఎకరాల భూమి 1954 ఖాస్రా పహాణి నుంచి 1986 అడంగల్ పహాణి వరకు తన తాత పేరు మీద ఉండగా, 1986 తర్వాత పహాణిలో సత్యం రామలింగారాజు, ఇతరుల పేర్లను రెవెన్యూ అధికారులు నమోదు చేశారని మహేశ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందులోని ఐదెకరాలను ఇటీ వల ఈటల రాజేందర్ తనయడు నితిన్‌రెడ్డి, మరో వ్యక్తి సాదా కేశవరెడ్డి కొనుగోలు చేశారని తెలిపారు. ఈ విషయంపై రాజేందర్‌ను కలసి గోడు వెళ్లబోసుకోగా, ఆయన తనను బెదిరించారని మహేశ్ పేర్కొన్నారు. -
భూమి కబ్జా.. దంపతుల ఆత్మహత్యాయత్నం
మహబూబునగర్ టౌన్: జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజావాణి సందర్భంగా దంపతులు కలెక్టరేట్లో ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటన మహబూబునగర్ జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి సందర్భంగా సోమవారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు.. వనపత్తి మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన శ్రీలక్ష్మి, శ్రీరాములు దంపతులు సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొని ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఏడేళ్ల క్రితం ప్రభుత్వం వీరికి 100 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించింది.. అయితే, కొంత మంది కబ్జాదారులు ఆ భూమిని కబ్జాచేశారు. దీంతో న్యాయం చేయాలని దంపతులు ప్రజావాణిలో 7సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదు. ఈ క్రమంలోనే సోమవారం జరిగిన ప్రజావాణిలో వారు ఆత్మహత్యాయత్నం చేశారు.