landan
-
‘లేడీ’ లేడీతో ఢీ అంటోన్న ఫొటో వైరల్
సాక్షి, న్యూఢిల్లీ : నీలి రంగు గౌను ధరించిన పడుచమ్మాయి ఇటీవల లండన్‌లోని రిచ్మండ్ పార్క్‌కు వెళ్లారు. అక్కడ ఎండు గడ్డిలో గంతులేస్తోన్న జింకను చూసి ముచ్చటపడ్డారు. సోషల్ మీడియా ‘ఇన్స్టాగ్రామ్’ కోసం ఓ సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించారు. అది మీదకు దూసుకురావడంతో ఆ అమ్మాయి హఠాత్తుగా వెనుతిరిగారు. ఆమెకు సెల్ఫీ ముచ్చట తీరిందో, లేదోగానీ ఈ దశ్యాన్ని మాత్రం ఫొటో తీసిన రాయల్ పార్క్ పోలీసులు దాన్ని అక్టోబర్ 11వ తేదీన పోస్ట్ చేశారు. ‘పార్క్‌లో తిరుగుతున్న ఆ జింక ‘డిస్నీ’ సిరీస్‌లోని బాంబి క్యారెక్టర్ లాంటిది కాదు. పైగా దానికి ఇప్పుడు ‘మేటింగ్ సీజన్’. అది క్రూరంగా దాడి చేస్తుంది. కనుక జింకలకు కనీసం 50 మీటర్లు దూరంగా ఉండండి’ అంటూ రాయల్ పార్క్ పోలీసులు ఓ హెచ్చరిక చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోన్న ఈ ఫొటో కింద హెచ్చరికను చూసే చూసినవారంతా నవ్వుకుంటున్నారు. జింక ఫోజు చూస్తే దాడి చేస్తున్నట్లు లేదు. ఆ కళ్లలో క్రూరత్వం అసలు కనిపించడం లేదు. ఆ అమ్మాయి ఫొటోను చూస్తుంటే భయపడి పోయి బిక్క చచ్చి పోయినట్లు కనిపించడం లేదు. సరదాగే అలా ఫోజించినట్లు కనిపిస్తోంది.. అంటూ సోషల్ మీడియా యూజర్లు వ్యాఖ్యానాలతోపాటు ఉద్దేశపూర్వకంగానే రాయల్ పార్క్ పోలీసులు అలా ఫోటో తీశారేమోననే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. -
నిర్మలా సీతారామన్‌కు అరుదైన ఘనత
లండన్ : యూకె - ఇండియా సంబంధాలను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషించిన 100 మంది ప్రభావంతులైన మహిళల్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు చోటు దక్కింది. బ్రిటన్‌కి చెందిన సీనియర్ కేబినెట్ మంత్రి పెన్నీ మోర్డాంట్ కూడా ఈ జాబితాలో నిలిచారు. సోమవారం ‘భారత దినోత్సవం’ సందర్భంగా యూకె హోంశాఖ కార్యదర్శి సాజిద్ జావిద్ ఈ జాబితాలను పార్లమెంట్ హౌస్‌లో విడుదల చేశారు. నిర్మలా సీతారామన్ కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రిగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాల్లో కీలకమైన పాత్ర పోషించారు. భారతదేశంలో ఈ మంత్రిత్వ శాఖ నిర్వహించిన అత్యంత ప్రభావవంతమైన మహిళగా నిర్మల గుర్తింపు పొందారు. నిర్మల లండన్ స్కూల్ ఆఫ్ ఎననామిక్స్‌లో తన చదువును పూర్తి చేసుకొని.. అక్కడ ఉద్యోగం కూడా చేసిన విషయం తెలిసిందే. లండన్ ఆమెకి ఎక్కువగా సుపరిచతమైన నగరంగా చెప్పవచ్చు. బ్రిటన్ - ఇండియా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో నిర్మల ఎంతో ప్రతిభ కనబరిచనారు. మహిళా శక్తికి నిదర్శనంగా ఈ జాబితాలో ఆమెకు స్థానం దక్కిందని యూకెలోని భారత హైకమిషనర్ రుచి ఘనశ్యాం పేర్కొన్నారు. ఈ జాబితాలోని మహిళలు ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేయడమే కాదు.. ఇరు దేశాలను శక్తిమంతంగా మలచడంలో కృషి చేశారని అన్నారు. వాణిజ్యం, కళలు, అక్షరాస్యత తదితర అంశాల్లో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయన్నారు. -
బాత్ టబ్‌లో పడి ఎన్నారై మహిళ మృతి!
ఫరిదాబాద్: హరియాణాలో ఓ ఎన్ఆర్ఐ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఫరిదాబాద్‌లోని తాజ్ వివాంట హోటల్లో బాత్ టబ్‌లో పడి ఉన్న మహిళ మృతదేహన్ని ఆలస్యంగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..లండన్‌లో స్థిరపడిన భారత సంతతి మహిళ రీతూ కుమార్ (40) ఈ నెల 22న భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి ఫరిదాబాద్‌లోని తాజ్ వివాంట హోటల్ బస చేస్తున్నారు. కాగా ఆమె కుటుంబ సభ్యులు గురువారం రీతూ కుమార్‌కు ఫోన్ చేయగా స్పందించలేదు. దీంతో వారు ఫోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శుక్రవారం హోటల్లోని వచ్చి ఆమె గదిలోకి వెళ్లి చూడగా బాత్రూంలో ఆమె మృతదేహం లభించింది. కాగా ఆమె గత కొద్ది రోజులుగా తన భర్తతో కలిసి ఉండడం లేదని, ఆమె గదికి కూడా హోటల్ సిబ్బందిని రావద్దని చెప్పినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టంకి పంపారు. -
బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలి
లండన్‌లో డెప్యూటీ సీఎం మహమూద్ అలీ రాయికల్ : బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలని డెప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. లండన్‌లో సోమవారం ఎన్ఆర్ఐ టీఆర్‌ఎస్‌సెల్, యూకే, హైదరాబాద్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం పలు రకాల రాయితీలు ఇస్తోందన్నారు. గల్ఫ్ దేశాల్లోని కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మంత్రి కేటీఆర్ ఎన్ఆర్ఐ పాలసీపై కసరత్తు చేస్తున్నారని తెలిపారు. సందేహాలు, సలహాలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం వివిధ సంఘాల ప్రతినిధులు డెప్యూటీ సీఎంను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు కూర్మాచలం అనిల్, సెక్రటరీలు నవీన్‌రెడ్డి, దొంతుల వెంకట్‌రెడ్డి, యూకే ఇన్చార్జి విక్రమ్‌రెడ్డి, శ్రీధర్‌రావు, లండన్ ఇన్చార్జి రత్నాకర్‌రావు, మధుసూదన్‌రెడ్డి, హైదరాబా«ద్ అసోసియేషన్ అధ్యక్షుడు ముజీద్, ఉపాధ్యక్షుడు నవాజ్, ప్రధాన కార్యదర్శి షమి, టీడీఎఫ్ అధ్యక్షుడు రామారావు, జేపీఆర్‌డీసీ అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, టీఈఎన్ఎఫ్ అధ్యక్షుడు చంద్రశేఖర్, టేకా అధ్యక్షుడు చంద్ర, తెలంగాణ అధ్యక్షుడు సంపత్ పాల్గొన్నారు. -
లండన్‌లో టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
రాయకల్: ఎన్నారై టీఆర్ఎస్ సెల్-యూకే ఆధ్వర్యంలో లండన్‌లో సోమవారం టీఆర్ఎస్ పార్టీ 15 వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్నారై టీఆర్ఎస్ సెల్ లండన్ ఇన్చార్జి రత్నాకర్ అధ్యక్షత వహించారు. యూకే నలుమూలల నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ప్రధాన కార్యదర్శి అశోక్ దుసరి, కారదర్శి వెంకట్‌రెడ్డి దొంతుల, ఎన్నారై టీఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తదితరులు పాల్గొన్నారు.