Landline connections
-
ల్యాండ్‌లైన్ యూజర్లకు కొత్త నంబరింగ్ సిస్టం: ట్రాయ్
న్యూఢిల్లీ: వినియోగంలో లేని ఫోన్ నంబర్లను కూడా అందుబాటులోకి తెచ్చే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్.. కేంద్రానికి సిఫార్సులు చేసింది. వీటి ప్రకారం కొత్త నంబర్ సిస్టం కోడ్ ఇకపై టెలికం సర్కిల్ లేదా రాష్ట్ర స్థాయిలో ఉంటుంది. ల్యాండ్‌లైన్ యూజర్లు మరో ల్యాండ్‌లైన్ యూజరుకు కాల్ చేయాలంటే మొత్తం పది అంకెలు డయల్ చేయాల్సి వస్తుంది. ముందుగా సున్నాను, తర్వాత ఎస్టీడీ కోడ్, ఆ తర్వాత ఫోన్ నంబరును డయల్ చేయాల్సి ఉంటుంది. ఒకే ఎస్డీసీఏలో (షార్ట్ డిస్టెన్స్ చార్జింగ్ ఏరియా) లోకల్ కాల్ చేయాలన్నా ముందగా సున్నాను జోడించి, ఎస్‌డీసీఏ కోడ్, ఆతర్వాత యూజరు నంబరును డయల్ చేయాలి. కొత్త నంబరింగ్ విధానం వల్ల ప్రస్తుత యూజర్ల నంబర్లలో ఎలాంటి మార్పు ఉండదని ట్రాయ్ తెలిపింది. నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు టెలికం ఆపరేటర్లకు 6 నెలల వ్యవధినివ్వాలని టెలికం శాఖకు సూచించింది. -
ల్యాండ్‌లైన్ కాల్ చార్జీలు తగ్గుతాయ్
- ఐయూసీ ,ఎఫ్‌టీసీ, ఎంటీసీ తొలగింపు - ల్యాండ్‌లైన్ నెట్వర్క్ వృద్ధి కోసం ట్రాయ్ చర్యలు న్యూఢిల్లీ: ల్యాండ్‌లైన్ కనెక్షన్ల జోరును పెంచడానికి, లాండ్‌లైన్ నెట్వర్క్ వృద్ధి కోసం, ఈ రంగంలోకి పెట్టుబడులను ఆకర్షించడానికి టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కీలక నిర్ణయాలు తీసుకుంది. ల్యాండ్‌లైన్ ఫోన్ల నుంచి చేసే కాల్స్‌కు ఇంటర్ కనెక్షన్ యూసేజీ చార్జీలను(ఐయూసీ) పూర్తిగా తొలగించింది. గతంలో ఈ చార్జీ కాల్‌కు 20 పైసలుగా ఉండేది. ఇక మొబైల్ ఫోన్ల నుంచి చేసే కాల్స్‌కు ఐయూసీ చార్జీలను కాల్‌కు 20 పైసల నుంచి 14 పైసలకు(30 శాతం) తగ్గించింది. మొబైల్స్ నుంచి ల్యాండ్‌లైన్‌కు చేసే కాల్స్‌కు ఫిక్స్డ్ టెర్మినేషన్ చార్జీలు(ఎఫ్‌టీసీ)కూడా ఇకపై ఉండవు. ఆలాగే ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్ ఫోన్లకు చేసే కాల్స్‌కు మొబైల్ టెర్మినేషన్ చార్జీలు(ఎంటీసీ) ఉండవు. ఈ నిర్ణయతో ల్యాండ్‌లైన్ కాల్ రేట్లు తగ్గుతాయని ట్రాయ్ పేర్కొంది.