- ఐయూసీ ,ఎఫ్‌టీసీ, ఎంటీసీ తొలగింపు
- ల్యాండ్‌లైన్ నెట్‌వర్క్ వృద్ధి కోసం ట్రాయ్ చర్యలు
న్యూఢిల్లీ: ల్యాండ్‌లైన్ కనెక్షన్ల జోరును పెంచడానికి, లాండ్‌లైన్ నెట్‌వర్క్ వృద్ధి కోసం, ఈ రంగంలోకి పెట్టుబడులను ఆకర్షించడానికి టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కీలక నిర్ణయాలు తీసుకుంది. ల్యాండ్‌లైన్ ఫోన్ల నుంచి చేసే కాల్స్‌కు ఇంటర్ కనెక్షన్ యూసేజీ చార్జీలను(ఐయూసీ) పూర్తిగా తొలగించింది. గతంలో ఈ చార్జీ కాల్‌కు 20 పైసలుగా ఉండేది.
ఇక మొబైల్ ఫోన్ల నుంచి చేసే కాల్స్‌కు ఐయూసీ చార్జీలను కాల్‌కు 20 పైసల నుంచి 14 పైసలకు(30 శాతం) తగ్గించింది. మొబైల్స్ నుంచి ల్యాండ్‌లైన్‌కు చేసే కాల్స్‌కు ఫిక్స్‌డ్ టెర్మినేషన్ చార్జీలు(ఎఫ్‌టీసీ)కూడా ఇకపై ఉండవు. ఆలాగే ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్ ఫోన్లకు చేసే కాల్స్‌కు మొబైల్ టెర్మినేషన్ చార్జీలు(ఎంటీసీ) ఉండవు. ఈ నిర్ణయతో ల్యాండ్‌లైన్ కాల్ రేట్లు తగ్గుతాయని ట్రాయ్ పేర్కొంది.
ల్యాండ్‌లైన్ కాల్ చార్జీలు తగ్గుతాయ్
Published Tue, Feb 24 2015 1:28 AM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM
Advertisement
Advertisement