సభ జరుగుతుంటే సెల్ఫోన్లతో కాలక్షేపం
కర్ణాటక అసెంబ్లీలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల నిర్వాకం
బెంగళూరు: శాసనసభలోకి సెల్ఫోన్లు తీసుకురాకూడదన్న నిబంధనను ఉల్లంఘించి ఇద్దరు కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలు సభ జరుతుండగానే తమ సెల్ఫోన్లను చూసుకుంటూ మీడియా కంటబడ్డారు.
వారిలో ఔరాద్ఎమ్మెల్యే ప్రభు చౌహాన్ కాంగ్రెస్ చీఫ్ సోనియా తనయ ప్రియాంక ఫొటోను జూమ్ (పెద్దదిగా చేయడం) చేసి చూడటం వివాదాస్పదమవగా మరో ఎమ్మెల్యే యు.బి. బణకార్ ఫోన్లో వీడియో గేమ్స్ ఆడటంపైనా విమర్శలు వెల్లువెత్తాయి.