పన్నుల పెంపు.. ధరలపై ఒత్తిడి
న్యూఢిల్లీ : గత నాలుగేళ్లలో సర్వీసు పన్నులు దాదాపు 25శాతం పెరిగాయట. ఆర్థికసంవత్సరం 2016లో దాదాపు రూ.2.1లక్షల కోట్లు సేకరించినట్టు అంచనా. అయితే ఈ పన్నుల పెరుగుదల కారణంగానే రిటైల్ ధరల పెరుగుదలపై ఒత్తిడి తీవ్రతమవుతుందని మార్కెట్ విశ్లేషకులు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పసిడి, కార్లు, మొబైల్ ఫోన్లపై వేసే ఎక్సైజ్, కస్టమ్స్ పన్నుల కంటే ఈ సర్వీసు పన్నులు ఎక్కువగా ఉన్నాయట. 2015 ఏప్రిల్ లో ప్రభుత్వం సేకరించిన 12.3 శాతం పన్నులు 2015 మే వరకు 14శాతానికి పెరిగాయని తెలుస్తోంది. రెస్టారెంట్లు, పెట్రోలు పంపులు, మల్టీ ఫ్లెక్సిల్స్ లాంటి వాటిపై వేసే పన్నులు సర్వీసు టాక్స్ ల కిందకు వస్తాయి.
పీవీఆర్ భారత్ లో కలిగిఉన్న 500 మల్టీప్లెక్సిల్స్ పై రూ.1,750 కోట్ల అమ్మకాలపై ఈ ఆర్థిక సంవత్సరం రూ.40కోట్లు సర్వీసు పన్నులు చెల్లించారట. అయితే 2014 ఆర్థికసంవత్సరంలో ఈ పన్నుల మొత్తం కేవలం రూ.7.3కోట్లు మాత్రమే. అయితే కేవలం పన్నుల రేట్లు పెంచడం ద్వారానే ఈ మొత్తం పెరగడం లేదని, పన్నుల ఎగవేతపై ప్రభుత్వం తీసుకునే చర్యలు సర్వీసు పన్నుల కలెక్షన్లు పెరగడానికి దోహదం చేస్తున్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేశారు.. అయితే పన్నుల రేట్ల పెంపు, టాక్స్ బేస్ పెరగడం కూడా పన్నుల కలెక్షన్ కు సహాయపడుతుందని తెలిపారు. టెక్నాలజీ సహాయంతో సర్వీసు టాక్స్ డిపార్ట్ మెంట్ పన్నుల ఎగవేతదారులను గుర్తించడం ప్రారంభించింది. దీంతో ఎగవేతదారులను నిరోధించగలిగామని సర్వీసు టాక్స్ డిపార్ట్ మెంట్ తెలిపింది.