late coming
-
IPL 2024- MI Punishment Jumpsuit: ఆలస్యం చేశారో అందరికీ ఇదే పనిష్మెంట్! (ఫోటోలు)
-
7ఏళ్లలో తొలిసారి 20 నిమిషాలు లేటు.. ఉద్యోగం నుంచి తొలగింపు!
ఆఫీస్‌కు సరైన సమయానికి చేరుకోవాలని ప్రతి ఒక్క ఉద్యోగి భావిస్తాడు. కొన్నిసార్లు అనివార్య కారణాల వల్ల కొంత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సంస్థలు కొంత ఆలస్యంగా వచ్చేందుకు వెసులుబాటు కల్పిస్తాయి. అయితే.. ఓ వ్యక్తి 20 నిమిషాలు లేటుగా ఆఫీసుకు రావటంతో ఉద్యోగం కోల్పోయాడు. అతను ఉద్యోగంలో చేరిన ఏడేళ్లలో ఇదే మొదటిసారి ఆలస్యం కావటం గమనార్హం. తన సహ ఉద్యోగి ఒకరు ఈ అంశాన్ని రెడిట్‌లో షేర్ చేశారు. అయితే.. ఈ సంఘటన ఎక్కడ జరిగిందనేది క్లారిటీ లేదు. రెడిట్‌లోని యాంటీవర్క్ ఫోరమ్‌లో ఈ పోస్ట్‌ను షేర్ చేశారు ఓ వ్యక్తి. సంస్థలో ఏడేళ్లకుపైగా పని చేస్తూ మొదటి సారి ఆలస్యమ్యయాడని, కేవలం 20 నిమిషాలు లేటుగా వచ్చినందుకు ఉద్యోగంలో నుంచి తొలగించారని పేర్కొన్నారు. ఆ వ్యక్తిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని మిగితా సిబ్బంది ఆందోళన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ‘అతడిని తిరిగి విధుల్లోకి తీసుకునే వరకు రేపటి నుంచి నేను, నా సహ ఉద్యోగులు ఆఫీసుకు లేటుగా రావాలని నిర్ణయించాం.’ అని పేర్కొన్నారు. 79వేల మంది దీనికి మద్దతుగా నిలిచారు. సంస్థ యాజమాన్యం నిర్ణయాన్ని చాలా మంది యూజర్లు తప్పుపట్టారు. ఆ ఉద్యోగిని ఉద్దేశపూర్వకంగానే తొలగించి తక్కువ జీతాన్ని పని చేసే వ్యక్తిని ఉద్యోగంలో చేర్చుకోవాలని సంస్థ భావించిన్లు కనిపిస్తోందని ఆరోపించారు. ఇదీ చదవండి: ‘భార్య అలిగి వెళ్లిపోయింది.. సెలవు ఇవ్వండి ప్లీజ్’.. క్లర్క్ లేఖ వైరల్ -
ప్రయాణికులకు ఒక్కొక్కరికి రూ.250 చెల్లిస్తాం..
లక్నో: దేశంలోనే మొదటి ప్రైవేటు రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించినప్పుడు ఒక వేళ ఏదైనా కారణంతో రైలు ఆలస్యమైతే అందుకు పరిహారం చెల్లిస్తామని ఐఆర్సీటీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇచ్చిన మాటకు కట్టుబడిన ఐఆర్సీటీసీ శనివారం తేజస్ ఎక్స్‌ప్రెస్ రెండు గంటలు ఆలస్యం నడవడంతో అందులో ప్రయాణించిన ప్రయాణికులకు ఒక్కొక్కరికి రూ.250 చొప్పున చెల్లిస్తామని ప్రకటించింది. శనివారం రైలులో ప్రయాణించిన ప్రయాణికులందరి ఫోన్లకు ఒక వెబ్ లింక్‌ను సందేశం ద్వారా పంపించామని, ఆ లింక్ ద్వారా ప్రయాణికులు పరిహారాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చని ఐఆర్సీటీసీ చీఫ్ రీజనల్ మేనేజర్ అశ్విని శ్రీవాస్తవ తెలిపారు. శనివారం లక్నో నుంచి ఢిల్లీకి రెండు గంటలు ఆలస్యంగా బయల్దేరిన తేజస్ ఎక్స్‌ప్రెస్, తిరుగు ప్రయాణంలోనూ రెండు గంటలు ఆలస్యంగా నడిచింది. లక్నో నుంచి ఢిల్లీకి వెళ్లేటప్పుడు 451 మంది, తిరుగు ప్రయాణంలో 500 మంది ప్రయాణికులు ప్రయాణించారు. రైలు ఆలస్యమైనందుకు అందులోని ప్రయాణికులకు పరిహారం అందించడం దేశంలో ఇదే మొదటిసారి. -
10 నిమిషాలు లేట్‌గా వచ్చినందుకు విడాకులు..
లక్నో : ట్రిపుల్ తలాక్ నేరం అంటూ కేంద్ర ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చినప్పటికి ఇలాంటి సంఘటనలు మాత్రం ఆగడం లేదు. భార్య 10 నిమిషాలు ఇంటికి ఆలస్యంగా వచ్చిందని చెప్పి ఫోన్లోనే విడాకులిచ్చాడు ఓ ప్రబుద్ధుడు. యూపీలో జరిగింది ఈ సంఘటన. వివరాలు.. బాధితురాలు జబ్బుచేసి ఉన్న తన నానమ్మను చూడ్డానికి పుట్టింటికి వెళ్లింది. వెళ్లే ముందు భర్త సరిగా అర్ధగంటలో ఇంట్లో ఉండాలని హెచ్చరించాడు. అయితే భర్త చెప్పిన టైం కాన్న ఓ పది నిమిషాలు ఆలస్యంగా ఇంటికి వచ్చింది బాధితురాలు. దాంతో బాధితురాలి భర్త ఆమె సోదరునికి ఫోన్ చేసి మూడుసార్లు తలాక్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. భర్త నిర్వకం తెలుసుకున్న బాధితురాలు తన కుటుంబసభ్యులను తీసుకుని అత్తారింటికి వస్తే ఆమె మీద దాడి చేసి ఇంట్లో నుంచి గెంటేశారు. దీంతో బాధితురాలు తన భర్త, అతని కుటుంబసభ్యుల మీద పోలీస్ కేసు పెట్టింది. పోలీసులు విచారణ మొదలుపెట్టారు. బాధితురాలు మాట్లాడుతూ.. తనకు న్యాయం చేయాలని లేకపోతే.. ఆత్మహత్యే దిక్కని బాధపడుతుంది. అంతేకాక పెళ్లైన నాటి నుంచి అత్తింటివారు తనను కట్నం కోసం వేధిస్తున్నారని తెలిపింది. తన తల్లిదండ్రులు చాలా పేదవారిని కట్నం ఇచ్చుకోలేరని చెప్పినా వినిపించుకోవడం లేదని వాపోయింది. కట్నం కోసం తనను కొట్టడమే కాక.. ఇప్పటికే ఒక సారి ఆబార్షన్ కూడా చేయించారని తెలిపింది. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని కోరింది. -
ఆలస్యంగా వస్తే.. గవర్నరైనా అంతే!
కేరళ గవర్నర్ పి.సదాశివానికి చేదు అనుభవం ఎదురైంది. సాధారణంగా వీఐపీలు, వీవీఐపీలు విమానాలు ఎక్కడానికి చిట్టచివరి నిమిషం వరకు రారు. మామూలు ప్రయాణికులను అయితే అలా అనుమతించరు. కానీ వీఐపీలకు మాత్రం ఆ వెసులుబాటు ఉండేది. అయితే కొచ్చి నుంచి తిరువనంతపురం వెళ్లేందుకు ఎయిరిండియా విమానం ఎక్కాల్సిన కేరళ గవర్నర్.. విమానం టేకాఫ్ తీసుకోవాల్సిన చిట్టచివరి నిమిషం వరకు రాలేదు. దాంతో ఎయిరిండియా వర్గాలు ఆయనను అనుమతించలేదు. నిజానికి రాత్రి 9.20 గంటలకు బయల్దేరాల్సిన ఎయిరిండియా విమానం ఎఐ 048 రాత్రి 11.40 గంటల వరకు బయల్దేరలేదు. అంతసేపు ఆపినా.. గవర్నర్ మాత్రం 11.28 గంటలకు టర్మాక్ వద్దకు చేరుకున్నారు. ఆయనకు నేరుగా అక్కడి నుంచే విమానం ఎక్కే అవకాశం ఉంది. కానీ అప్పటికే విమానం టేకాఫ్ తీసుకోడానికి సిద్ధం కావడంతో.. నిచ్చెనను ఇవతలకు లాగేశారు. దాంతో గవర్నర్ విమానం ఎక్కడానికి వీలు కుదరలేదు. ఎయిరిండియాకు చెందిన ఓ అధికారి గవర్నర్ బోర్డింగ్ పాస్ పట్టుకుని ఉన్నా.. దాంతో ఎలాంటి ఉపయోగం కనిపించలేదు. గవర్నర్ సదాశివం కాసేపు అక్కడే ఉండి.. తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయారు. త్రిసూర్‌లో అధికారిక కార్యక్రమానికి హాజరై అక్కడి నుంచి నేరుగా విమానాశ్రయానికి వచ్చారని రాజ్‌భవన్ ఉద్యోగులు తెలిపారు. సాధారణంగా గవర్నరే విమానం ఎక్కే చివరి వ్యక్తి అవుతారని.. అయితే ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇలా జరిగి ఉంటుందని అన్నారు. 2014 ఏప్రిల్ వరకు సదాశివం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. పదవీ విరమణ చేసిన నాలుగునెలల తర్వాత ఆయన కేరళ గవర్నర్ అయ్యారు.