బెజవాడలో అదిరిన ఆటో షో
విజయవాడ: విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్లో సాక్షి, టీవీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో షో ఆకట్టుకుంటోంది. ఈ షోను నగర మేయర్ కోనేరు శ్రీధర్ శుక్రవారం ప్రారంభించారు. రెండు రోజులపాటు జరిగే ఈ ఆటోషోలో ఆటో మొబైల్స్ రంగానికి చెందిన 18 ప్రముఖ సంస్థలు... రెండు బ్యాంకింగ్ సంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. ఆటోమొబైల్ రంగంలోకి కొత్తగా అడుగుపెట్టిన వివిధ మోడళ్లను సంస్థలు ప్రదర్శిస్తున్నాయి.
దీంతోపాటు లేటెస్ట్ మోడల్ కార్లను కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఈ ఆటోషోలో వాహనాలను బుక్ చేసుకున్న వారికి ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటించాయి కంపెనీలు. అంతేకాదు విజయవాడలో మొట్టమొదటి సారిగా... ఈ షోకి వచ్చేవారికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేందుకు బైక్ రేసింగ్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. టీవీఎస్ కంపెనీకి చెందిన బైక్ రేసర్లు రకరకాల విన్యాసాలతో ఆటోషోకు వచ్చిన సందర్శకులను ఆకట్టుకుంటున్నారు.