బెజవాడలో అదిరిన ఆటో షో | sakshi, tvs mega auto show in vijayawada | Sakshi
Sakshi News home page

బెజవాడలో అదిరిన ఆటో షో

Published Fri, Oct 2 2015 3:47 PM | Last Updated on Sat, Mar 9 2019 4:28 PM

బెజవాడలో అదిరిన ఆటో షో - Sakshi

బెజవాడలో అదిరిన ఆటో షో

విజయవాడ: విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో సాక్షి, టీవీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో షో ఆకట్టుకుంటోంది. ఈ షోను నగర మేయర్‌ కోనేరు శ్రీధర్‌ శుక్రవారం ప్రారంభించారు. రెండు రోజులపాటు జరిగే ఈ ఆటోషోలో ఆటో మొబైల్స్‌ రంగానికి చెందిన 18 ప్రముఖ సంస్థలు... రెండు బ్యాంకింగ్‌ సంస్థలు స్టాల్స్‌ ఏర్పాటు చేశాయి. ఆటోమొబైల్‌ రంగంలోకి కొత్తగా అడుగుపెట్టిన వివిధ మోడళ్లను  సంస్థలు ప్రదర్శిస్తున్నాయి.

దీంతోపాటు  లేటెస్ట్‌ మోడల్‌ కార్లను కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఈ ఆటోషోలో వాహనాలను బుక్‌ చేసుకున్న వారికి ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటించాయి కంపెనీలు. అంతేకాదు విజయవాడలో మొట్టమొదటి సారిగా... ఈ షోకి వచ్చేవారికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేందుకు బైక్‌ రేసింగ్‌ టీమ్‌ను ఏర్పాటు చేశారు. టీవీఎస్ కంపెనీకి చెందిన బైక్‌ రేసర్లు రకరకాల విన్యాసాలతో ఆటోషోకు వచ్చిన సందర్శకులను ఆకట్టుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement