lathicharji
-
దాడికేసు విచారణ వేగవంతం
17మంది అరెస్ట్ పోలీసుల వైఖరికి నిరసనగా మహిళల ఆందోళన ఎస్.ఐ,హోంగార్డుల సస్పెన్షన్‌కు డిమాండ్ ఏఎస్పీ హామీతో విరమణ చీడికాడ: చీడికాడ, బైలపూడి గ్రామా ల్లో పోలీసులపై దాడి కేసు విచారణను అధికారులు వేగవంతం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు చీడికాడ పోలీస్‌స్టేషన్‌లో అనుమానితులను వి చారించారు. ఏఎస్పీ ఎ.బాబూజీ ఆ ద్వర్యంలో రెండు గ్రామాలకు చెందిన పలువురు అనుమానితులను సాయంత్రం చోడవరం పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. అనంతరం వా రిని ఎక్కడికి తరలించిందీ తెలియరాలేదు. విషయాన్ని పోలీసులు గోప్యం గా ఉంచారు. అయితే చీడికాడకు చెం దిన 17మందిని అరెస్టు చేసి రిమాం డ్కు తరలించినట్లు చోడవరం ఇన్చార్జి సీఐ భూషణనాయుడు తెలిపా రు. తదుపరి విచారణ అనంతరం మరికొందరిని అరెస్టు చేయనున్నట్టు తెలిపారు. కాగా పోలీసులపై దాడి ఘ టనలో విచారణ పేరుతో అమాయకులను హింసిస్తే సహించేది లేదంటూ చీడికాడవాసులు ఆందోళన చేపట్టా రు. శుక్రవారం పోలీస్ స్టేషన్‌ను ము ట్టడించారు. పోలీసుల అభ్యర్థన మేర కు ముగ్గురిని గ్రామపెద్దలు ఏఎస్పీ బాబూజీ సమక్షంలో అప్పగించారు. వారి వెంట పెద్ద ఎత్తున మహిళలు పో లీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపటా రు. దాడికి కారణాలును విశ్లేషించకుం డా అమాయకులను స్టేషన్‌కు తె చ్చి రెండు రోజులుగా చితక బాద డం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిం చారు. వినాయక నిమజ్జనానికం టూ హోంగార్డు నాయుడు, అతని తొత్తు మురళి, ఎస్.ఐ కలిసి రూ. 5వేలు వ సూలు చేశారని, ప్రశాంతంగా నిమజ్జనం చేసుకుంటున్నవారిపై లాఠీఛార్జి చేసి రెచ్చగొట్టారన్నారు. నెల రోజుల క్రితం తన భర్త అప్పలనాయుడును హోంగార్డు నాయుడు అన్యాయంగా కొట్టాడని ఫిర్యాదు చేస్తే పట్టించుకొని పోలీసులు ఇప్పుడు జీపు ధ్వంసమం డటూ అమయాకులను వేధించడం ఎం తవరకు న్యాయమని ఉమా అనే మ హిళ పోలీసులను నిలదీసింది. హోం గార్డు నాయుడు, ఎస్ఐ విశ్వనాథంలను సస్పెండ్ చెయ్యాలంటూ సర్పం చ్ దాసరి పంపురమ్మ,ఎంపీటీసీ స భ్యురాలు కడితి దేముడమ్మలతో పా టు మహిళలు స్టేషన్ ఎదుట ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఒకదశ లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పో లీసులు లాఠీలతో నిరసన కారులను చెదరగొట్టేందుకు సిద్ధపడ్డారు. గ్రామ పెద్దల చొరవతో స్పందించిన ఏఎస్పీ బాబూజీ, చోడవరం ఇన్చార్జి సీఐ భూషన్ నాయుడు మహిళలతో చ ర్చించారు. ఈ సందర్భంగా భూషన్ నాయుడు మాట్లాడుతూ హోంగార్డు నాయుడును బదిలీ చేశామని,విచార ణ అనంతరం ఎస్.ఐపై చర్యలు తీసుకుంటామని,ఈ దాడితో సంబం దం లేని వారిని విడిచి పెడతామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. ఇప్పటి వరకు ఎవరిని అర స్టు చెయ్యలేదని బాబూజీ చెప్పారు. -
పోలీసులను తరిమికొట్టిన జనం
భయం గుప్పెట్లో చీడికాడ ఎస్ఐ లాఠీఛార్జీలో ఎంపీటీసీ భర్తకు గాయం వినాయక నిమజ్జనంలో అపశ్రుతి పెద్ద ఎత్తున మోహరించిన బలగాలు పరిస్థితిని సమీక్షించిన ఎస్పీ చీడికాడ : వినాయక నిమజ్జనంలో మంగళవారం రా త్రి అపశ్రుతి చోటుచేసుకుంది. అశ్లీల నృత్యాలు చేసు తన్న వారిపై ఎస్ఐ లాఠీఛార్జి చేయడంతో జనం తిరగ బడ్డారు. పోలీసులను తరిమికొట్టారు. దీంతో బలగా లు మండల కేంద్రం చీడికాడతోపాటు బైలపూడిని చుట్టుముట్టాయి. రూరల్ ఎస్పీ కోయ ప్రవీణ్ ఆధ్వర్యంలో పోలీసు ఉన్నతాధికారులు బుధవారం పరిస్థితిని సమీక్షించారు. వివరాలు ఇలా ఉన్నాయి. వినాయక నిమజ్జనంలో భాగంగా బైలపూడిలో అశ్లీల నృ త్యాలు జరుగుతున్నట్టు అందిన సమాచారం మేరకు ఎస్.ఐ విశ్వనాథం సిబ్బందితో వెళుతుండగా చీడికాడ మొయిన్‌రోడ్డులో వివిధ వీధులకు చెందిన వినాయక విగ్రహాలకు నిమజ్జనానికి ఊరేగిస్తున్నా రు. ఇందులో భాగంగా ఇద్దరు హిజ్రాలతో డ్యాన్స్ చేయిస్తుండడంతో ఎస్.ఐ విశ్వనాథం వారిపై లాఠీ ఛార్జి చేశారు. ట్రాక్టర్ తాళాలు తీసుకున్నారు. అనంతరం బైలపూడి వెళ్లిపోయారు. అక్కడ గుమ్మాల వారి కుటుంబీకులకు చెందిన వినాయక నిమజ్జనంలో ఎంపీటీసీ భర్త గుమ్మాల తారకేసు,అప్పారావులు చీరలు కట్టుకుని ఆడవారి వేషంలో డాన్స్ చేస్తున్నారు. వారిపై కూడా ఎస్ఐ లాఠీఛార్జి చేశారు. దీంతో తారకేసు కుడిచేయిపై గట్టిగా కొట్టారు. ఈ క్రమంలో పోలీసులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో గ్రామస్తులు పోలీసులపై దాడి చేశారు. ఈ సంఘటనలో హోంగార్డు కనకరాజుకు కుడి కన్ను కనత, చెంపపై వాపుగాయం అయింది. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా శిరిజాం జంక్షన్లో మహిళలు,యువకులు పోలీసు జీపును అడ్డుకున్నారు. పలువురు యువకులు రోడ్డుకు అడ్డంగా పడుకున్నారు. మరికొందరు జీపుపైకి ఎక్కి అద్దాలు,లైట్లను ధ్వంసం చేశారు. జీపు టైర్లలో గాలి తీసేశారు. పోలీసులపై పిడుగుద్దులతో దాడి చేశారు. ఈ పరిణామంతో జీపును వదిలి పోలీసులు పరుగులు తీశారు. ఈ సంఘటనలో ఎస్.ఐ విశ్వనాథం సెల్‌ఫోన్ పగిలిపోయింది. ఇలా ఎస్ఐతోపాటు సిబ్బందిపై దాడి జరిగిన వైనంపై చీడికాడ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఎస్పీ విచారణ చేపట్టారు. ధ్వంసమైన జీపు, పగిలిపోయిన ఎస్ఐ సెల్‌ఫోన్, గాయపడిన హోంగార్డు కనకరాజును పరిశీలించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న అనుమానితులను విచారించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉత్సవాలప్పుడు గ్రామాల్లో అపశ్రుతులతో ప్రజాజీవనానికి అటంకం కలిగించే శక్తులను అడ్డుకునేందుకు అహర్నిశలు కాపాలాగా ఉండే పోలీసులపై దాడి శోచనీయమన్నారు. అటువంటి వారిపై తీవ్రంగా వ్యవహరిస్తారన్నారు. ఈమేరకు గ్రామమంతటా పోలీసులు మోహరించారు. అనుమానితులను అదుపులోకి తీసుకునేందుకు నాలుగు జీపుల్లో బలగాలు గ్రామంలో చక్కర్లు కొట్టాయి. దీంతో అంతటా భయాందోళనలు నెలకొన్నాయి. ఎస్ఐ విశ్వనాథం బాధ్యతలు చేపట్టిన ఏడు నెలల్లోనే మండలంలోని నీలంపేట,చినకోనాంలతో పాటు ఇప్పుడు చీడికాడ,బైలపూడి గ్రామాల వారు పోలీసులపై దాడులు,కేసులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.