Launches drug
-
కరోనా : తక్కువ ధరలో మరో ఫావిపిరవిర్ డ్రగ్
సాక్షి, ముంబై : ప్రముఖ ఫార్మా సంస్థ లుపిన్ కరోనా వైరస్ నివారణకు ప్రయోగాత్మక ఔషధంగా భావిస్తున్నఫావిపిరవిర్ డ్రగ్ లాంచ్ చేసింది. కోవిహాల్ట్ పేరుతో ఈ ఔషదాన్ని బుధవారం అందుబాటులోకి తీసుకొచ్చినట్టు బుధవారం ప్రకటించింది. 200 మి.గ్రా టాబ్లెట్ ధరను 49 రూపాయలుగా నిర్ణయించింది. (కరోనా వాక్సిన్: నోవావాక్స్ శుభవార్త ) తేలికపాటి నుండి మోడరేట్ లక్షణాలున్న కోవిడ్-19 రోగుల్లో చికిత్స కోసం కోవిహాల్ట్ బ్రాండ్ పేరుతో భారతదేశంలో తన ఫావిపిరవిర్‌ను ప్రారంభించినట్లు లుపిన్ వెల్లడించింది. ఇది 10 టాబ్లెట్ల స్ట్రిప్ రూపంలో లభిస్తుందని లుపిన్ ఇండియా రీజియన్ ఫార్ములేషన్స్ (ఐఆర్ఎఫ్) ప్రెసిడెంట్ రాజీవ్ సిబల్ తెలిపారు. తమ బలమైన నెట్ వర్క్ ద్వారా దేశవ్యాప్తంగా ఈ ఔషధాన్నిఅందుబాటులో తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.(కరోనాకు అతిచవక మందు వచ్చేసింది) అత్యవసర వినియోగానికి ఫావిపిరవిర్ ఔషధానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుండి అనుమతి పొందింది. ఫావిపిరవిర్‌ను మొదట జపాన్‌కు చెందిన ఫుజిఫిల్మ్ హోల్డింగ్స్ అవిగన్ బ్రాండ్ పేరుతో అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. దేశీయంగా దీని తయారీ, విక్రయానికి గ్లెన్ మార్క్, హెటెరో, సిప్లా, సన్ ఫార్మ లాంటి దిగ్గజ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలను చేసుకుంది. -
కిక్కెక్కడం లేదు
ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరులోని మందు బాబులు గగ్గోలు పెడుతున్నారు.. ఎంత తాగినా కిక్కెక్కడం లేదని ఆరోపిస్తున్నారు. మద్యంలో నీళ్లను కలుపుతుండటమే ఇందుకు కారణం. అధికారులు పట్టించుకోకపోవడంతో మద్యం వ్యాపారులు కల్తీ మద్యాన్ని యధేచ్చగా విక్రయిస్తున్నారు. అయినా గిట్టుబాటు కావడం లేదని కల్తీకి తోడు ధరలు కూడా పెంచేశారు. వాణిజ్య కేంద్రంగా పేరుపొందిన ప్రొద్దుటూరులో మద్యం వ్యాపారాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 21 మద్యం షాపులు ఉన్నాయి. 8 బార్లు ఉన్నాయి. కొన్ని రోజులుగా తమకు నీళ్లు కలుపుతున్న మద్యాన్ని విక్రయిస్తున్నారని మందుబాబులు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. నెలకు 850 బాక్స్‌లు విక్రయించాల్సిందే.. ఈ ఏడాది జూలై నుంచి కొత్త మద్యం షాపులు ప్రారంభం అయ్యాయి. బెల్ట్ షాపులు లేనందున ఎక్సైజ్ అధికారులు మద్యం వ్యాపారులకు టార్గెట్లు విధించలేదు. అయితే గత ఏడాది కంటే ఈ ఏడాది విక్రయాలు బాగా తగ్గాయని భావించిన ఎక్సైజ్ అధికారులు తాజాగా టార్గెట్లు విధించారు. ఒక్కో షాపులో నెలకు 850 బాక్స్‌ల మద్యం సీసాలు విక్రయించాలని టార్గెట్ పెట్టినట్లు తెలుస్తోంది. టార్గెట్ విధించిన నేపథ్యంలో అధికారులు, వ్యాపారుల మధ్య పరస్పర అంగీకారం జరిగినట్లు సమాచారం. ఎమ్మార్పీపై రూ. 5 పెంచి విక్రయించుకుంటామని వ్యాపారులు అడగడంతో ఎక్సైజ్ అధికారులు తలాడించినట్లు తెలుస్తోంది. దీంతో నాలుగు రోజుల నుంచి పట్టణంలోని మద్యం షాపుల్లో ఎమ్మార్పీ కంటే రూ. 5 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా పట్టణంలోని పలు మద్యం షాపుల్లో ఉదయం 9 నుంచే విక్రయాలు జరుగుతున్నాయి. మద్యం శాఖ అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. నా దృష్టికి వచ్చింది.. కేసులు రాస్తాం ఎమ్మార్పీ కంటే రూ.5 అదనంగా విక్రయిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ శంభూప్రసాద్ వివరణ ఇచ్చారు. మద్యం షాపుల్లో తనిఖీలు నిర్వహించి కేసులు రాయమని సీఐకి ఆదేశాలు జారీ చేశామన్నారు. ఆయన రాయకుంటే తానే రాస్తానన్నారు. టార్గెట్లు విధించిన మాట వాస్తవమేనని..అయితే ఎమ్మార్పీ ధరలకే మద్యాన్ని విక్రయించాలన్నారు. టార్గెట్‌కు ధరలకు సంబంధం లేదన్నారు.