సీఎం అధికారాలను కత్తిరించే యోచన లేదు
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో చర్చలు సఫలం అయ్యాయిన టీఆర్ఎస్ ఎంపీ కేకే తెలిపారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతల అంశంపై టీఆర్ఎస్ ఎంపీలు గురువారం రాజ్‌నాథ్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశం అనంతరం కేకే మాట్లాడుతూ రాష్ట్ర అధికారాలను తగ్గించబోమని రాజ్‌నాథ్ చెప్పారని, రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారమే నడుచుకుంటామన్నారన్నారు. ముఖ్యమంత్రి అధికారాలను హరించబోమని, రాష్ట్రాల హక్కుల అధికారాల్లో జోక్యం చేసుకోమని రాజ్‌నాథ్ చెప్పారని కేకే తెలిపారు. సమాఖ్య స్ఫూర్తిని కాపాడుతామన్నారన్నారు.
కాగా అంతకు ముందు గవర్నర్‌కు అధికారాలు అప్పగింత అంశంపై ఎంపీలు హోంమంత్రితో చర్చించారు. గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు ఇస్తే రాష్ట్ర హక్కులను హరించడమేనని ఎంపీలు తేల్చి చెప్పారు. గవర్నర్‌కు అధికారాలు ఇవ్వవద్దని స్పష్టం చేశారు. ఇక నరసింహన్ ఢిల్లీ టూర్ నేపథ్యంలో వీరి సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.