Law clerk
-
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 20 లా క్లర్కు పోస్టులు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒప్పంద ప్రాతిపదికన లా క్లర్కు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 20 ► అర్హత: మూడు లేదా ఐదేళ్ల లా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. ► వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి. ► ఎంపిక విధానం: వైవా వాయిస్ నిర్వహిస్తారు. సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► వైవా వాయిస్ నిర్వహించే తేది: 06.12.2021 ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్(రిక్రూట్మెంట్), హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అమరావతి, నేలపాడు, గుంటూరు జిల్లా–522237 చిరునామకు పంపించాలి. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► దరఖాస్తులకు చివరి తేది: 23.11.2021 ► వెబ్సైట్: hc.ap.nic.in -
న్యాయవాద గుమస్తాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా అనూప్‌కుమార్
హన్మకొండ అర్బన్ : తెలంగాణ న్యాయవాద గుమస్తాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా వరంగల్‌కు చెందిన వి.అనూప్‌కుమార్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి న్యాయవాద గుమస్తాల సంఘం సర్వసభ్య సమావేశం ఆదివారం హన్మకొండ సుబేదారిలోని పంక్షన్ హాల్లో నిర్వహించి తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర సంఘాన్ని ఎన్నుకున్నారు. సంఘం ప్రధాన కార్యదర్శిగా చందు(ఖమ్మం), కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బి.వి. పురుషోత్తం(వరంగల్), సంయుక్త కార్యదర్శిగా శంకరలింగం(నల్గొండ), కోశాధికారిగా ఆర్.కుమారస్వామి, కార్యవర్గ సభ్యులుగా నాగరాజు, పవన్Sకుమార్, తిరుపతి, సారయ్య ఎన్నికయ్యారు. రాష్ట్రంలోని 10 జిల్లాలకు కార్యవర్గంలో ప్రాతినిధ్యం కల్పించారు. ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో న్యాయవాద గుమస్తాలకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, పీఎఫ్, ఇన్సూరెన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాలు చేశారు.