ఓయూ లా కాలేజీ మెస్ మూసివేత
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ న్యాయ కళాశాల భోజనశాలను పూర్తిగా మూసి వేశారు. పాత బకాయిలతో పాటు ప్రస్తుతం చదవుతున్న విద్యార్థులు మెస్ చార్జిలను చెల్లించనందున మెస్ నిర్వహణ కష్టతరంగా మారిందని న్యాయకళాశాల ప్రిన్సిపాల్ ప్రొ.పంత్నాయక్ తెలిపారు.
ఏడాదికి ఒక్కొక్క విద్యార్థి రూ.30 వేలను చెల్లించాలన్నారు. గత రెండు సంవత్సరాలుగా విద్యార్థులు ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడంతో వంట సరుకుల కోసం అప్పులు చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. మెస్ బకాయిలు సుమారు కోటి రూపాయలకు పైనే ఉందన్నారు. అయితే విద్యార్థులు మాత్రం న్యాయ కళాశాల హాస్టల్ భవనంలోనే ఉంటున్నారని పేర్కొన్నారు.