జయ తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లవచ్చు
బెంగళూరు : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసుకు సంబంధించి హై కోర్టు స్పెషల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేయడం సబబుగా ఉంటుందని కర్ణాటక ప్రభుత్వానికి న్యాయవాది బీ.వీ ఆచార్య గురువారం లేఖ రాశారు. తీర్పు ప్రతిలో అక్రమ ఆస్తులను లెక్కగట్టడంలో తప్పులు జరిగాయని ప్రభుత్వానికి రాసిన లేఖలో ఆచార్య పేర్కొన్నారు.
కాగా, బీ.వీ ఆచార్య కర్ణాటక తరఫున జయలలిత అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి స్పెషల్ పబ్లిక్ప్రాసిక్యూటర్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లక పోతే కర్ణాటక హై కోర్టు స్పెషల్ బెంచ్ తీర్పును ప్రశ్నిస్తూ తానే దేశ అత్యున్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటీషన్ను జూన్ 1న దాఖలు చేస్తానని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి గురువారం ట్విట్ చేశారు.