అసభ్య ప్రవర్తనపై ఫిర్యాదు
సత్యనారాయణపురం : ఓ లాయర్ అసభ్యంగా ప్రవ ర్తించాడని ఒక యువతి సత్యనారాణపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథ నం మేరకు.. రెడ్డి నాగలక్ష్మి స్థానిక నాగేశ్వరరావు పంతులు రోడ్డులోని దుర్గా ఆయిల్ మిల్ పైన నివసిస్తోంది. డీలర్ అయిన తల్లి మృతి చెందడంతో నాగలక్ష్మి రేషన్‌డిపో నడుపుతోంది. ఆమె డబ్బు అవసరమై ఇద్దరి వద్ద రూ.3.80లక్షలు అప్పుగా తీసుకుంది. బాకీ తీర్చేందుకు లాయర్ తాతారావు వద్ద రూ.4 లక్షలు తీసుకుంది.
అందుకు తన పేరుతో ఉన్న రేకులషెడ్డును అతని పేర జీపీ చేయించింది. ఇంకా బాకీ ఉండడంతో రేకుల షెడ్డును విక్రయించి బాకీలు తీర్చాలని నాగలక్ష్మి భావించి లాయర్‌ను సంప్రదించింది. అయితే తాను ఫోన్లో మాట్లాడతానని చెప్పిన లాయర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. గత నెల 27వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో సత్యనారాయణపురంలోని ఆమె ఇంటికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయంలో పెద్దమనుషుల వద్ద రాజీకి ప్రయత్నిం చినా ఫలితం లేకపోవడంతో యువతి సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తుచేపట్టారు.