పవన్ కళ్యాణ్‌పై కేసు నమోదు
హైదరాబాద్: ప్రముఖ హీరో, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై సరూర్‌నగర్ పోలీసుస్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. సినిమా థియేటర్లలో జాతీయ గీతాన్ని ఆలపించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పవన్ కళ్యాణ్ అవమానించారంటూ హైకోర్టు న్యాయవాది జనార్ధన్ గౌడ్ పవన్‌పై కేసు పెట్టారు. సుప్రీం కోర్టు తీర్పును తన ట్విట్టర్ ఖాతాలో పవన్ అవమానించినట్లు చెప్పారు. దేశ ప్రజల్లో జాతీయగీత వ్యతిరేక ప్రచారం చేస్తూ రెచ్చగొడుతున్నారని, దేశ వ్యతిరేక చర్యలకు పవన్ పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు.