laxminarasimha swami
-
యాదాద్రికి పోటెత్తిన భక్తులు
యాదాద్రి: యాదాద్రికి భక్తులు పోటెత్తారు. శ్రీ లక్ష్మీనర్సింహ స్వామివారి ధర్మ దర్శనానికి ప్రస్తుతం మూడున్నర గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండున్నర గంటలు పడుతోంది. కార్తిక మాసం కావడంతో భక్తుల రద్దీ వీపరీతంగా పెరిగింది. భక్తుల రద్దీ దృష్ట్యా వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు. -
ఘనంగా లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
కదిరి: అనంతపురం జిల్లా కదిరిలో లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలను ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు స్వామివారి రథోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. అయితే స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్టీసి అధికారులు అత్యుత్సాహంతో చార్జీలు పెంచడంపై భక్తుల నుంచి విమర్శలు వ్యక్తమౌతున్నయి. స్పెషల్ బస్సుల పేరుతో కదిరి వెళ్లే బస్సుల్లో.. టికెట్‌పై అదనపు చార్జీని అధికారులు వసూలు చేస్తున్నారు. -
నేటి నుంచి నృసింహుని జయంత్యుత్సవాలు
యాదగిరికొండ(నల్లగొండ): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నాయి. మే 2వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే ఇవి జరుగుతాయి. హైదరాబాద్ నుంచి ప్రతి అరగంటకు ఒక ఆర్టీసీ బస్సు కొండపైకి వెళ్లేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం నృసింహ జయంతి మహోత్సవం, నృసింహ అవతార వైభవంతో ఉత్సవాలు ముగియనున్నాయి.