అనుమానం.. ఆస్తి తగాదాలే కారణం
నాగోలు, భానుపురి, న్యూస్‌లైన్: కిరాయి హంతకులతో కలిసి భార్యను, కుమారుడిని హత్య చేసిన కేసులో భర్తతో పాటు కిరాయిహంతకుడిని ఎల్బీనగర్ పోలీసులు గురువారం అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానం, ఆస్తిని అమ్మకుండా అడ్డుకుందనే కక్షతోనే ఈ దారుణానికి పాల్పడినట్టు భర్త వెల్లడించాడు.
ఎల్బీనగర్ క్రైం సీఐ రవీంద్రారెడ్డి కథనం ప్రకారం... సూర్యాపేట కుడకుడకు చెందిన గుర్రం శశిధర్‌రెడ్డి(40)కి నార్కట్‌పల్లి మండలం నెమ్మానికి చెందిన విజయలక్ష్మి(38)తో 1996లో పెళ్లైంది. వీరికి కు మారుడు సాకేత్‌రెడ్డి(13) సంతానం. వీరు సూర్యాపేట అంజనాపురికాలనీలో ఉండేవారు. విజయలక్ష్మి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో శశిధర్‌రెడ్డి ఆమెను తరచు వేధించేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. మే నెలలో సూర్యాపేటకు చెందిన విజయను శశిధర్‌రెడ్డి రెండో పెళ్లి చేసుకున్నాడు.
దీంతో అతనిపై మొదటి భార్య విజయలక్ష్మి సూర్యాపేట ఠాణాలో కేసుపెట్టింది. పోలీసులు శశిధర్‌రెడ్డి రిమాండ్‌కు తరలించారు. సూర్యాపేటలో శశిధర్‌రెడ్డికి సుమారు రూ.10 కోట్ల విలువైన ఆస్తులున్నా యి. వాటిని అమ్మడానికి యత్నించగా విజ యలక్ష్మి అడ్డుకుని కోర్టులో కేసు వేసింది. ఈనేపథ్యంలో గొడవలు జరుగుతుండడం తో విజయలక్ష్మి కుమారుడు సాకేత్రెడ్డిని తీసుకుని నగరానికి వచ్చేసింది.
నాగోలు సాయినగర్‌లోని సాయిమిత్ర అపార్ట్మెం ట్లో ఫ్లాట్‌ను కొనుగోలు చేసి ఉంటోంది. కొడుకును నారాయణ పాఠశాలలో 8వ తరగతి చదివిస్తోంది. ఆస్తి విషయంలో తనకు అడ్డుగా ఉన్న విజయలక్ష్మిని చంపేయాలని శశిధర్‌రెడ్డి నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని తన అక్కలు విజయ, సుజాత, విమల, పెద్దమ్మ సునందలకు చెప్పగా.. వా టరు విజయలక్ష్మిని చంపేయని, నీకు అం డగా ఉంటామన్నారు. దీంతో అతను తుం గతుర్తి మండలం గరుడవెల్లికి చెందిన మాజీ రౌడీషీటర్, మూడు హత్య కేసులలో ప్రధాన నిందితుడైన పోనుగంటి మధుసూదన్‌రావును సంప్రదిం చాడు.
తన భార్యను చంపితే రూ.4 లక్షలు సుపారీ ఇస్తానని చెప్ప గా అతను అంగీకరించాడు. ప్రస్తుతం వరంగల్జిల్లా బేతవోలులో ఉంటున్న మధుసూదన్‌రావు అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ భుజంగరావుకు విషయం చెప్పగా.. అతను నాలుగు వేటకొడవళ్లను సిద్ధం చేశాడు. తర్వాత రామంతాపూర్‌కు చెందిన మోహన్, సూర్యాపేటకు చెందిన కనకరత్నంతో కలిసి విజయలక్ష్మి హత్యకు పథకం పన్నారు. ఈనెల 22న శశిధర్‌రెడ్డితో పాటు ఐదుగురూ కలిసి వనస్థలిపురంలోని మనోహర్ లాడ్జిలో దిగారు.