Le eco
-
లీ ఎకో బిగ్గెస్ట్ ఆన్లైన్ షాపింగ్ ఫెస్ట్
చైనా మొబైల్ తయారీ సంస్థ లీఎకో బిగ్గెస్ట్ ఆన్ లైన్ షాపింగ్ ఫెస్టివల్ కు తెరలేపింది. లీఇకో ‘ఎపిక్ 919 సూపర్ ఫ్యాన్స్ ’ పేరుతో మెగా సేల్ తో పాటు వినియోగదారులకు తగ్గింపు, ధరలు, ఫ్రీ కూపన్లు అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీని ద్వారా 24 గంటల ఆన్ లైన్ లైవ్ షాపింగ్ ను దేశంలో లాంచ్ చేయనుంది. సెప్టెంబర్ 19, సోమవారం అర్థరాత్రినుంచి లీమాల్. కాం, ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ లైవ్ ఈవెంట్ ప్రారంభం కానుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మెగా సేల్‌ద్వారా సూపర్ ఫోన్లు, సూపర్ టీవీలను ప్రత్యేక తగ్గింపు ధరల్లో వినియోగదారులకు అందించనున్నామని పేర్కొంది. సుమారు రూ.100కోట్ల (తొంభై ఐదు మిలియన్ల)మేర అమ్మకాలు జరపాలనుకున్నట్లు సంస్థ ప్రకటించింది. దీంతోపాటు డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తోంది.అలాగే ఎలాంటి ఆదనపు చార్జీలు లేకుండా ఆరు నెలల ప్రత్యేక ఈఎంఐ తదితర ప్రత్యేక ఆఫర్లను కంపెనీ తెలిపింది. మరోవైపు ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేసిన వారికి మరికొన్ని ఆఫర్లను అందిస్తోంది. ఇయర్ ఫోన్లు,మేక్ మై ట్రిప్ ఫ్రీ కూపన్లు తదితర బంపర్ ఆఫర్లు ఇస్తోంది. ఉబెర్, మేక్ మై ట్రిప్ కంపెనీల భాగస్వామ్యంతో ఈ ప్రత్యేక రాయితీలు, ఆఫర్లు కూడా ప్రకటించింది. ఎపిక్ 919 సూపర్‌ఫ్యాన్స్ ఫెస్టివల్ పేరుతో చైనాలో నిర్వహించిన మెగాసేల్ విజయవంతమైందని.. ఒకే రోజు 5లక్షల లీ సూపర్ఫోన్లను అమ్మినట్లు లీఎకో ఇండియా సీవోవో అతుల్ జైన్ తెలిపారు. భారతనుంచి ఇంతకంటే ఎక్కువ ఆదరణ లభించనుందనే ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలకు లీమాల్. కాంను సందర్శించవచ్చు. -
లీఎకో నుంచి ‘సూపర్3’ సిరీస్ స్మార్ట్ టీవీలు
ధర రూ.59,790-రూ.1,49,790 న్యూఢిల్లీ: చైనా ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘లీఎకో’ తాజాగా తన ‘సూపర్3’ సిరీస్ అల్ట్రా హెచ్డీ స్మార్ట్‌టీవీలను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ సిరీస్‌లో 55 అంగుళాల ‘ఎక్స్55’, 65 అంగుళాల ‘ఎక్స్65’, 65 అంగుళాల ‘మ్యాక్స్65’అనే ప్రొడక్టులు ఉన్నాయి. 4కే అల్ట్రా హెచ్డీ (3840ఁ2160) రెజల్యూషన్ వీటి సొంతం. ‘ఎక్స్55’ ధర రూ.59,790గా, ‘ఎక్స్65’ ధర రూ. 99,790గా, ‘మ్యాక్స్65’ ధర రూ.1,49,790గా ఉంది. ఈ టీవీలు ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తాయని, ఇందులో ఆండ్రాయిడ్ యాప్స్‌ను రన్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ‘ఎక్స్55’లో 2 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీని, మిగతా ప్రొడక్టులలో 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ ఫీచర్లను పొందుపరిచామని పేర్కొంది. ఈ ఆండ్రాయిడ్ టీవీలన్నీ వినియోగదారులకు కంపెనీ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ లీమాల్ సహా ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఆగస్ట్ 10 నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపింది. -
లాఇకో చెంతకు అమెరికా ఎలక్ట్రానిక్స్ సంస్థ
2 బిలియన్ డాలర్లకు కొనుగోలు న్యూఢిల్లీ: చైనీస్ హ్యాండ్ సెట్ తయారీ సంస్థ లాఇకో అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కంపెనీ ‘విజియో’ను 2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినట్టు ప్రకటించింది. ‘విజియో’కి చెందిన సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, టెక్నాలజీ వ్యాపారం, మేథోసంపత్తి హక్కులు ఈ ఒప్పందంలో భాగంగా లాఇకో సొంతం అవుతాయి. ఈ ఏడాది చివరి త్రైమాసికంలో ఈ లావాదేవీ పూర్తవుతుందని లాఇకో ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాలన్నతమ విధానంలో విజియో కొనుగోలు కీలకమైన అడుగని, ఉత్తర అమెరికాలో తమ స్థానాన్ని బలోపేతం చేస్తుందని లాఇకో చైర్మన్, సీఈవో యూటింగ్ జియా చెప్పారు. ఉత్తర అమెరికాలో... కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఇర్విన్ పట్టణంలో 2002లో ఏర్పాటైన విజియో ఉత్తర అమెరికాలో ప్రధాన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్‌గా ఎదిగింది. స్మార్ట్ టీవీలు, సౌండ్బార్ల విక్రయాల్లో అగ్రస్థానంలో ఉంది. విజియో బ్రాండ్కుతోడు పంపిణీదారుల నెట్వర్క్ లాఇకో కంపెనీకి కలసిరానున్నాయి. కొనుగోలు అనంతరం విజి సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ వ్యాపారాన్ని తన పూర్తి అనుబంధ కంపెనీ కింద లాఇకో నిర్వహించనుంది. డేటా వ్యాపారం ‘ఇన్స్కేప్’ను విడిగా ఓ ప్రైవేటు కం పెనీ కిందకు మార్చనుంది.