లీ ఎకో బిగ్గెస్ట్ ఆన్లైన్ షాపింగ్ ఫెస్ట్ | LE ECO The biggest online shopping festival | Sakshi
Sakshi News home page

లీ ఎకో బిగ్గెస్ట్ ఆన్లైన్ షాపింగ్ ఫెస్ట్

Published Mon, Sep 19 2016 12:06 PM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM

లీ ఎకో  బిగ్గెస్ట్ ఆన్లైన్ షాపింగ్   ఫెస్ట్ - Sakshi

లీ ఎకో బిగ్గెస్ట్ ఆన్లైన్ షాపింగ్ ఫెస్ట్

చైనా మొబైల్‌ తయారీ సంస్థ లీఎకో బిగ్గెస్ట్ ఆన్ లైన్ షాపింగ్ ఫెస్టివల్ కు తెరలేపింది. లీఇకో ‘ఎపిక్‌ 919 సూపర్  ఫ్యాన్స్  ’ పేరుతో మెగా సేల్‌ తో పాటు  వినియోగదారులకు   తగ్గింపు, ధరలు, ఫ్రీ కూపన్లు అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది.  దీని ద్వారా  24 గంటల ఆన్ లైన్ లైవ్ షాపింగ్ ను దేశంలో లాంచ్ చేయనుంది.   సెప్టెంబర్ 19, సోమవారం  అర్థరాత్రినుంచి  లీమాల్. కాం, ఫ్లిప్ కార్ట్ ద్వారా   ఈ  లైవ్ ఈవెంట్ ప్రారంభం కానుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.  

ఈ మెగా సేల్‌ద్వారా సూపర్ ఫోన్లు, సూపర్ టీవీలను ప్రత్యేక తగ్గింపు  ధరల్లో వినియోగదారులకు అందించనున్నామని  పేర్కొంది.      సుమారు రూ.100కోట్ల (తొంభై ఐదు మిలియన్ల)మేర అమ్మకాలు జరపాలనుకున్నట్లు సంస్థ  ప్రకటించింది. దీంతోపాటు డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తోంది.అలాగే  ఎలాంటి ఆదనపు చార్జీలు లేకుండా  ఆరు నెలల ప్రత్యేక ఈఎంఐ తదితర ప్రత్యేక ఆఫర్లను కంపెనీ తెలిపింది. మరోవైపు ఫ్లిప్ కార్ట్ ద్వారా  కొనుగోలు చేసిన వారికి మరికొన్ని ఆఫర్లను అందిస్తోంది.

ఇయర్ ఫోన్లు,మేక్ మై ట్రిప్ ఫ్రీ  కూపన్లు తదితర బంపర్ ఆఫర్లు ఇస్తోంది. ఉబెర్‌, మేక్‌ మై ట్రిప్‌ కంపెనీల భాగస్వామ్యంతో ఈ ప్రత్యేక రాయితీలు, ఆఫర్లు కూడా ప్రకటించింది. ఎపిక్‌ 919 సూపర్‌ఫ్యాన్స్‌ ఫెస్టివల్‌ పేరుతో చైనాలో నిర్వహించిన మెగాసేల్‌ విజయవంతమైందని.. ఒకే రోజు 5లక్షల లీ సూపర్‌ఫోన్లను అమ్మినట్లు లీఎకో ఇండియా సీవోవో అతుల్‌ జైన్‌ తెలిపారు.  భారతనుంచి ఇంతకంటే ఎక్కువ ఆదరణ లభించనుందనే ఆశాభావం ఆయన  వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలకు  లీమాల్. కాంను సందర్శించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement