కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకుల వాగ్వాదం
కోడేరు (కొల్లాపూర్): టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు వాగ్వాదానికి దిగిన సంఘటన మండలంలోని ముత్తిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. మంగళవారం కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తల్లి, భార్య గ్రామానికి వచ్చారు. టీఆర్ఎస్ నాయకులు వారిని చూసి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయడానికి వచ్చారా అని వాగ్వాదానికి దిగారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఇరుపార్టీల వారిని చెదరగొట్టారు.
ఎమ్మెల్యే తల్లి బిచ్చమ్మ, భార్యను అక్కడి నుంచి పంపించారు. దీంతో సమస్య సద్దుమణిగింది. గ్రామంలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే అటువంటి వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఏఎస్ఐ నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు.