రామన్‌పాడు లీకేజీ మరమ్మతు పనులు ప్రారంభం
నాగర్‌కర్నూల్: పట్టణానికి మూడు రోజుల్లో రామన్‌పాడు నీళ్లు అందజేయాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అధికారులకు ఇచ్చిన అదేశాలు అమలవుతున్నాయి. ఈ మేరకు అధికారులు కాంట్రాక్టర్లు మరమ్మతు పనులు వేగవంతం చేస్తున్నారు. ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు రోజు పనులను పర్యవేక్షించి పనుల పురోగతిని తనకు తెలియజేస్తారన్న మాటలకు అనుగుణంగా ఆదివారం కొత్తకోట మండలం వడ్డెవాడ గ్రామం వద్ద జరుగుతున్న పనులను నాగర్‌కర్నూల్ టీఆర్ఎస్ నాయకులు భాస్కర్‌గౌడ్, ప్రవీణ్‌కుమార్, గోపిరెడ్డిలు పనులను పరిశీలించారు. అనంతరం అక్కడి నుండే సంబంధిత కాంట్రాక్టర్‌ను ఎమ్మెల్యేతో మాట్లాడించారు. పనుల వేగవంతం కోసం ఎక్కువ సామర్ధ్యం కలిగిన మిషనరీని తెప్పించామని, బుధవారం వరకు పనులు పూర్తిచేసి నాగర్‌కర్నూల్‌కు నీరందిస్తామని కాంట్రాక్టర్ ఎమ్మెల్యేకు తెలిపారు.