Leather Industries
-
అపాచీ లెదర్ ఇండస్ట్రీకి శంకుస్థాపన చేసిన సీఎం జగన్
-
ఆ కంపెనీతో 2 వేల మందికి ఉపాధి: సీఎం జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా : ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల ఇండస్ట్రియల్ ఏరియాలో ఏర్పాటు చేయనున్న అపాచీ లెదర్ ఇండస్ట్రీకి గురువారం శంకుస్థాపన చేశారు. భూమి పూజ అనంతరం అపాచీ ఇంటెలిజెంట్ గ్రూప్ ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి మొక్కను నాటారు. ఈ భూమి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్ భాష, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా.. అపాచీ లెదర్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇంటెలిజెంట్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ జాన్సన్ చాంగ్, తైపే ఎకనామిక్ కల్చర్ సెంటర్ డైరెక్టర్ జనరల్ బెన్ వాంగ్, అపాచీ గ్రూప్ జనరల్ మేనేజర్ గవిన్ చాంగ్, వీజీఎం ముత్తు గోవింద స్వామి, వైస్ ప్రెసిడెంట్ సైమన్ చెంగ్, డైరెక్టర్లు సీన్ చెన్, హరియెట్లీ తదితరులు పాల్గొన్నారు. (పులివెందుల రుణం ఎప్పటికీ తీరనిది: సీఎం జగన్) ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘ తైవాన్ ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం కలిసి ఈ ప్రాజెక్టును ప్రారంభించాం. అడిడాస్ బ్రాండెడ్ షూస్ తయారీలో అపాచీ కీలకం. మనదేశంతో పాటు వియాత్నం, చైనాలోనూ అపాచీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 2006లో వైఎస్సార్ హయాంలో తడలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. తడ ఫ్యాక్టరీ ద్వారా ప్రతిఏటా కోటి 80 లక్షల ప్రొడక్షన్ జరుగుతోంది. 11 వేల మందికిపైగా ఉపాధి పొందుతున్నారు. తాజాగా పులివెందులలో తమ కంపెనీని విస్తరిస్తున్నారు. ఈ కంపెనీ ద్వారా 2వేల మందికి ఉపాధి లభిస్తుంది. 50 శాతం మహిళలకు ఉపాధి అవకాశాలు ఉంటాయి. శ్రీకాళహస్తిలో కూడా భూమిని కేటాయించాం. అక్కడ కూడా రూ.350 కోట్లతో పరిశ్రమను నెలకొల్పుతున్నారు. శ్రీకాళహస్తి పరిశ్రమ ద్వారా 5వేల మందికి ఉపాధి లభిస్తుంది. ప్రపంచ బ్యాంకుతో కలిసి కేంద్రం రిలీజ్ చేసిన ర్యాంకుల్లో ఏపీ అగ్రస్థానంలో ఉంది. పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలో ఏపీ ప్రథమ స్థానంలో ఉంద’’ని అన్నారు. -
‘ఆర్మూర్ లిడ్‌క్యాప్’నకు మహర్దశ
ఆర్మూర్ : తెలంగాణ రాష్ట్రంలో పది లిడ్ క్యాప్‌లు (చర్మ పరిశ్రమలు) ఉంటే అందులో ఆర్మూర్ లిడ్ క్యాప్‌ను ఒక్కదానిని మాత్రమే అభివృద్ధి చేయడానికి ఎంపిక చేసినట్లు సూక్ష్మ చిన్న తరహా మధ్య తరహా సంస్థ తెలంగాణ ప్రాజెక్టు డెరైక్టర్ అరవింద్ పట్వారి తెలిపారు. గురువారం పట్టణంలోని లిడ్ క్యాప్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లిడ్ క్యాప్ మేనేజింగ్ డెరైక్టర్ సైదతో కలిసి ఆయన మాట్లాడారు. ఆర్మూర్ ప్రాంతం రోడ్డు, రైల్వే రవాణా పరంగా కేంద్రంగా ఉండటం వల్ల క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం లో భాగంగా ఎంపిక చేశామన్నారు. ఈ ఏడాది జనవరి 15న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఫైనల్ అ ప్రూవల్ లభించిందన్నారు. 2016లోగా 10 కోట్ల 87 వేలతో ఆర్మూర్ లిడ్ క్యాప్‌ను దశల వారీగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఈ నిధులలో రూ. 7 కోట్ల 40 లక్షల 7 వేలు కేంద్ర ప్రభుత్వం, రూ. 2 కోట్ల 60 లక్షల 80 వేలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. రెండేళ్లలోగా పరిశ్రమకు అవసమయ్యే అన్ని మౌలిక స దుపాయాలను కల్పిస్తామన్నారు. ఆర్మూర్ లిడ్ క్యాప్‌లోని 28 ఎకరాల ఒక గుంట స్థలంలో ప్రహరీ, విద్యు త్ దీపాలు, మురికి కాలువలు, కాన్ఫరెన్స్ హాల్, రా మెటీరియల్ భద్ర పరిచే గది, ఎగ్జిబిషన్ సెల్ నిర్మాణా లు చేపడతామన్నారు. 700 గజాల విస్తీర్ణంతో ప్లాటు ్లగా మార్చి 89 యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. 15 వందల మందికి ఉపాధి ఈ లిడ్ క్యాప్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో 89 మందిని ఎంపిక చేసి ఈ 89 యూనిట్లను నిర్వహిస్తామన్నారు. తద్వారా సుమారు 15 వందల మందికి ప్ర త్యక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. లెదర్‌తో బ్యాగు లు, షూ, చెప్పులు తదితర వస్తువుల తయారీలో ఇక్కడ శిక్షణ ఇస్తామన్నారు. అయితే ఈ వస్తువులకు సరఫరా చేసే రా మెటీరియల్ తయారీ కీలకమైందన్నారు. తమిళనాడు రాష్ట్రంలో మాత్రమే లెదర్‌ను శు భ్రం చేసే ప్రాజెక్టు అందుబాటులో ఉందన్నారు. అలాంటి పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేయడానికి లిడ్ క్యాప్ ముందుకు వస్తే ప్రభుత్వం నుంచి రూ.15 కోట్లు మంజూరు చేయడానికి ప్రతిపాదనలు పంపిస్తామని ఆయన చెప్పారు.