రహస్యంగా దేశం విడిచిన పాక్ నటుడు
పాకిస్థాన్‌కు చెందిన నటీనటులందరూ సెప్టెంబర్ 25లోపు దేశం విడిచి వెళ్లిపోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ఉడీ ఉగ్రవాద దాడి అనంతరం మహారాష్ట్ర నవనిర్మాణ సేన అల్టిమేటం జారీచేయడం ప్రకంపనలు సృష్టిస్తోంది. భద్రత కల్పిస్తామని ముంబై పోలీసులు హామీ ఇచ్చినా.. పాక్‌కు చెందిన చెందిన సినీ, టీవీ నటీనటులు భయాందోళన చెందుతున్నారు. పాక్ నటుడు ఫవాద్ ఖాన్ రహస్యంగా దేశం విడిచి స్వదేశానికి వెళ్లిపోయాడు. ఇప్పట్లో భారత్‌కు తిరిగొచ్చే ఉద్దేశ్యం అతనికి లేదని తెలుస్తోంది.
కరణ్ జొహార్ సినిమాలో ఫవాద్ నటించాడు. ఎంఎన్ఎస్ హెచ్చరికల అనంతరం ఫవాద్ సినిమా ప్రమోషన్లో పాల్గొనడని కరణ్ జొహార్ ఇటీవల చెప్పాడు. కాగా పాక్ నటుల షూటింగ్‌లను అడ్డుకుంటామని, వాళ్లకు అవకాశాలు ఇవ్వరాదని ఎంఎన్ఎస్ నాయకులు బాలీవుడ్ దర్శక నిర్మాతలను హెచ్చరించారు. పాక్‌కు చెందిన పలువురు నటీనటులు బాలీవుడ్ సినిమాలు, టీవీ సీరియళ్లలో నటిస్తున్నారు. వీళ్లలో ఫవాద్ అగ్రశ్రేణి నటుడు.