Left ear
-
ఇదే ఆఖరి రోజు!.. బతికే ఉన్నందుకు కృతజ్ఞతలు..
న్యూయార్క్: కొన్ని యాక్సిడెంట్లు ఎంత భయంకరంగా జరుగుతాయంటే అసలు మనిషి బతికి ఉండే అవకాశం లేదన్నంత భయంకరంగా జరుగుతాయి. పైగా వాటిని చూస్తేనే వెన్నులో వణుకు పుట్టించేంత భయం వేస్తుంది. అచ్చం అలాంటి ఘటనే అమెరికాలో జరిగింది. (చదవండి: బాప్రే!...ఎంత పెద్ద భయానక దృశ్యం!) అసలు విషయంలోకెళ్లితే... యూఎస్‌లోని విస్కాన్సిన్లోని మిల్వాకీలో అలెగ్జాండర్ ఎవాన్స్ అనే 33 ఏళ్ల వ్యక్తి అమెజాన్ డెలివరీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఒకరోజు ఎవాన్స్ తన అమెజాన్ డెలివరీ ట్రక్‌తో మిల్వాకీలోని ఆమ్ట్రాక్ రైలును క్రాస్ చేస్తుంటాడు. అయితే అదే సమయంలో ఒక రైలు వస్తుంటుంది. కానీ ఎవాన్స్‌కి ఎడమ చెవి పనిచేయదు అందువల్ల అతను రైలు శబ్దాన్ని గమనించలేకపోతాడు. దీంతో రైలు ఒక్కసారిగా అతని ట్రక్‌ని ఢీ కొడుతుంది. ఇక అంతే రైలు ఆ ట్రక్‌ని ఈడ్చుకుని వెళ్లిపోతుంటుంది. అయినప్పటికీ ఎవాన్స్ తన ప్రాణం రక్షించుకోవటం కోసం ఏదోరకరంగా నడపటానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో అతని ట్రక్ రెండు ముక్కలుగా అయిపోతుంది. అయితే అదృష్టమేమిటంటే ఎవాన్స్ ఆ ప్రమాదం నుంచి సజీవంగా బయటపడతాడు. ఈ మేరకు ఎవాన్స్ భార్య మాట్లాడుతూ.. ‘నా భర్తను కాపాడినందుకు దేవుడికి కృతజ్ఞతలు. రైల్వే ట్రాక్ క్రాసింగ్‌ల వద్ద హెచ్చరిక సిగ్నల్లు, గేట్లు, లైట్లు వంటి సంకేతాలు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేస్తే ఇలాంటి ప్రమాదాలు తలెత్తవు’ అంటూ ఫేస్బుక్లో చెప్పుకొచ్చింది. (చదవండి: ప్రాణాలకోసం మూగ జీవీ పాకులాట.. మనసును కదిలించేలా..) -
చెవిలో గుయ్‌మనే శబ్దం వస్తోంది...
డాక్టర్ సలహా నాకు రెండు నెలల నుంచి ఎడమచెవిలో గుయ్ మని శబ్దం వస్తోంది. నాకు చెవి నొప్పి కానీ, వినికిడి సమస్య కానీ లేదు. అయితే చెవిలో శబ్దంతో పనిచేయలేకపోతున్నాను. సరైన సలహా ఇవ్వగలరు. - వినీల్, ముంబయి చెవిలో శబ్దం రావడానికి అనేక కారణాలు ఉంటాయి. అయితే మీరు చెప్తున్న ప్రాథమిక వివరాలను బట్టి, ఇటీవల మా దగ్గరకు వస్తున్న చెవి సమస్యలను బట్టి చూస్తే మీది సెల్‌ఫోన్ వాడకం ఎక్కువ కావడం వల్ల వచ్చిన సమస్యగా పరిగణించాల్సి వస్తోంది. ఇటీవల మా దగ్గరకు వస్తున్న పేషెంట్లలో ఎక్కువ మంది ఇదే సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా 25-30 ఏళ్ల వయసు వారిలో ఈ సమస్యకు కారణం... విపరీతంగా సెల్‌ఫోన్ మాట్లాడడం, రణగొణధ్వనుల్లో పని చేయాల్సి రావడం లేదా అలాంటి వాతావరణంలో నివసించడం వలన వస్తుంది. ఈ సమస్యను ‘టినైటస్’ అంటారు. ఈ సమస్యలో మొదట హైఫ్రీక్వెన్సీ శబ్దాలను సరిగ్గా వినలేకపోతారు. క్రమంగా మిగిలిన ఫ్రీక్వెన్సీలను కూడా. మీరు వెంటనే దగ్గరలో ఉన్న ఈఎన్టీ వైద్యనిపుణులను సంప్రదించి, చెవి పరీక్షలు చేయించుకోండి. సమస్యను నిర్ధారించుకున్న తర్వాత తగిన చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. - డాక్టర్ ఇ.సి. వినయ్‌కుమార్, ఈఎన్టి నిపుణులు