వర్గీకరణ చట్టబద్ధతకు చొరవ చూపండి
దత్తాత్రేయను కోరిన మంద కృష్ణ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిందనే శుభవార్త కోసం మాదిగ జాతి ఎదురు చూ స్తోందని, వర్గీకరణకు చట్టబద్ధత లభించే వరకు ప్రత్యేక చొరవ చూపాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కోరారు. గురువారం ఢిల్లీలో దత్తాత్రేయతో భేటీ అయిన మంద కృష్ణ ’ధర్మయుద్ధం’ మహా సభకు విచ్చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డితోనూ మంద కృష్ణ సమావేశమై వర్గీకరణకు పార్టీల పరంగా మద్దతు ఇవ్వాలని కోరారు.
ఎస్సీ రిజర్వేషన్లు కల్పించి ఆదుకోండి: అన్ని రంగాల్లో వెనుకబడిన ఆరెకటిక కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చి తమ అభివృద్ధికి తోడ్పడాలని కుల పోరాట సమితి నాయకుడు జి.సుధాకర్ కోరారు. ఎస్సీ రిజర్వేషన్లు కల్పించాలని కోరు తూ ఆరెకటిక పోరాట సమితి ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన రెండు రోజుల ధర్నా గురువారం ముగిసింది.