ఆమెకు అవార్డుతో బిత్తరపోయిన హాలీవుడ్ స్టార్!
గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల ప్రదానోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఆసక్తికర ఘటన ఇప్పుడు ఆన్లైన్లో హాట్ టాపిగ్గా మారింది. 'అమెరికన్ హర్రర్ స్టోరీ: 'హోటల్'లో నటనకుగాను టీవీ మూవీ కేటగిరీలో ఉత్తమ నటి అవార్డును పాప్ సింగర్ లేడి గాగాకు ప్రకటించారు. స్టేజ్‌కి దూరంగా కూచున్న గాగా ఆదరాబాదరాగా నడుచుకుంటూ.. తన చుట్టూ కూచున్న నటుల మధ్య నుంచి వెళ్లింది. ఈ క్రమంలో కూర్చిపై కూర్చొని ఉన్న లియోనార్డో డీకాప్రియో మోచేతిని గాగా బలంగా తోసుకుంటూ పోయింది.
అతని మోచేయి తనకు తాకిందన్న విషయాన్ని కూడా ఆమె పట్టించుకోలేదు. కానీ లియోనార్డో మాత్రం బిత్తరపోయి ఆమె వంక చూశాడు. ఆ చూపు కెమెరాకు చిక్కి.. అభిమానులకు హాట్ టాపిక్ గా మారింది. అసలు 'రెవెనంట్' సినిమాలో నటించినందుకు కాదు అలా బిత్తరపోయి చిత్రంగా గాగా వంక చూసినందుకు లియోనార్డోకు 'గోల్డెన్ గ్లోబ్' అవార్డు ఇవ్వాలంటూ ఆన్లైన్లో జోకులు పేలుతున్నాయి. హర్రర్ టీవీ షోలో రక్తాన్ని పీల్చే గబ్బిలంలా గాగా నటనకు 'గోల్డెన్ గ్లోబ్' రావడంపై బెస్ట్ రియాక్షన్ అవార్డు లియోకే ఇవ్వాలంటూ నెటిజన్లు వ్యంగ్య పోస్టులతో హోరెత్తిస్తున్నారు.
scuse u https://t.co/dNlwVvHkCN
— LW (@lindseyweber) January 11, 2016