Lesains driving
-
ఆర్టీఏకూ ‘ఆధార్’మే!
రవాణా శాఖ సేవలకు ఆధార్ లింక్ ప్రత్యేక కౌంటర్లలో నమోదు జిల్లాలో 9 లక్షల మంది వాహనదారులు ఆధార్ నమోదు చేసుకున్న వారు 5 వేల మంది మాత్రమే సాక్షి, విజయవాడ : ఇకపై రవాణాశాఖ ద్వారా పొందే ప్రతి సేవకూ ఆధార్ నంబరు జతచేయాల్సిందే. ఆశాఖ అందించే పౌరసేవల్ని మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో దీనికి శ్రీకారం చుట్టారు. రవాణా శాఖ ద్వారా వినియోగించుకునే ప్రతి సేవకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి అనే నిబంధన అమలుచేయడంతోపాటు గతంలో డ్రైవింగ్ లెసైన్స్ పొంది, వాహనాల రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారు కూడా ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలి. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో అధికారులు ప్రత్యేక డ్రైవ్‌లా కొనసాగిస్తున్నారు. దీనిపై వినియోగదారులకు అవగాహన కల్పించేలా ప్రచారం నిర్వహిస్తున్నారు. కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి మధ్యాహ్నం రెండు గంటల వరకు నమోదు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ప్రతి లెసైన్స్‌దారు, వాహన యజమాని ఆధార్ నంబర్‌ను తప్పనిసరిగా నమోదు చేయంచుకోవాలి. రవాణాశాఖ కార్యాలయాలతోపాటు నేరుగా ఆన్‌లైన్‌లోనూ నమోదు చేసుకునే ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు జిల్లాలో ఐదు వేల మంది వాహనదారులు తమ ఆధార్ నంబర్‌ను నమోదు చేసుకున్నారు. మొత్తం జిల్లాలో 9 లక్షల మంది వాహనదారులు ఉన్నారు. వీరిలో అత్యధికంగా విజయవాడ నగరంలోనే 5 లక్షల మంది ఉన్నారు. మిగిలిన నాలుగు లక్షల మంది జిల్లాలో ఉన్నారు. జిల్లా యంత్రాంగం ఆధార్ కార్డులపై నిర్వహించిన సర్వే ద్వారా జిల్లాలో సుమారు 95 శాతం మందికి ఆధార్ కార్డులున్నట్లు నిర్థారించారు. ఈ క్రమంలో జిల్లాలో ఉన్న 9 లక్షల మంది వాహనదారులు విధిగా ఆధార్ నంబర్ నమోదు చేయించుకునేలా ఏర్పాట్లు చేయడంతోపాటు కరపత్రాలు, వాల్‌పోస్టర్ల ద్వారా రవాణాశాఖ విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. వాహనాల రిజిస్ట్రేషన్ నుంచి లైఫ్ టాక్స్ చెల్లింపు వరకు వివిధ సేవలు అందుబాటులో ఉన్నాయి. డ్రైవింగ్ లెసైన్స్‌లు మొదలుకొని ఎన్వోసీ వరకు వివిధ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక నుంచి ప్రతి సేవకు సంబంధించి దరఖాస్తులో ఆధార్ నంబర్ నమోదు కాలమ్ తప్పనిసరిగా ఉంటుంది. ఆన్లైన్లో డ్రైవింగ్ లెసైన్స్ నమోదు చేసుకునేప్పుడు, డీలర్ వద్ద కొత్తవాహనం కొనుగోలు చేసే సమయంలోనూ, ఇతర లావాదేవీలు నిర్వహించే సమయంలోనూ ఆధార్ తప్పనిసరిగా నమోదు చేయాలి. వాహన రికార్డుల భద్రత కోసమే వాహన రికార్డుల భద్రత కోసమే ఆధార్ నంబర్‌ను తప్పనిసరి చేసినట్లు రవాణాశాఖ ప్రకటించింది. పెరిగిన సాంకేతిక పరిజ్ఙానంతో నకిలీ సీబుక్‌లు సృష్టించి ఏటా వందల సంఖ్యలో వాహనాలను విక్రయిస్తున్నారు. ఆధార్ నంబర్ లింక్ చేయడం ద్వారా దీనిని కొంతమేరకు కట్టడి చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి ఆధార్ నంబర్ నమోదు చేశాక వినియోగదారుడికి రవాణాశాఖ కార్యాలయంలో అకౌంట్ ఏర్పడుతుంది. తర్వాత నిర్వహించే ప్రతి లావాదేవీ సులభతరమవుతుంది. దీంతో పాటు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఏపీట్రాన్స్‌పోర్ట్ డాట్ ఆర్గనైజేషన్ వైబ్సెట్లో నేరుగా నమోదు చేసుకోవచ్చని రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ సీహెచ్.శివలింగయ్య సాక్షికి తెలిపారు. దీనిపై జిల్లాలో రెండు ఆర్టీవో కార్యాలయాలు, నాలుగు యూనిట్ ఆఫీసుల ద్వారా ప్రచారం నిర్వహించడంతో పాటు నమోదు కార్యక్రమం కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో ఐదు వేల మంది స్వచ్ఛందంగా నమోదు చేసుకున్నారని చెప్పారు. -
డ్రైవింగ్ లెసైన్స్ పొందడం ఇలా..
ప్రయోజనం సాక్షి, సిటీబ్యూరో: వాహనం నడిపేందుకు ప్రతి ఒక్కరు విధిగా డ్రైవింగ్ లెసైన్స్ కలిగి ఉండాలి. 18 ఏళ్లు దాటిన వారు గేర్లతో కూడిన ద్విచ క్ర వాహనాలు, కార్లు నడిపేందుకు రవాణాశాఖ నుంచి అనుమతి పొందవచ్చు. 18 ఏళ్లలోపు వారిని గేర్లు లేని టూ వీలర్స్ నడిపేందుకు మాత్రమే అనుమతిస్తారు. డ్రైవింగ్ లెసైన్స్ తీసుకోవడమనేది రెండు దశల ప్రక్రియ. లెర్నింగ్ లెసైన్స్ కోసం... లెర్నింగ్ లెసైన్స్ తీసుకోవాలంటే ఆర్టీఏ వెబ్సైట్ www.telangana transport.org లోకి వెళ్లి స్లాట్ బుక్ చేసుకోవాలి. - వాహనదారుల చిరునామాకు సమీపంలో ఉండే ప్రాంతీయ రవాణా కార్యాలయంలో మాత్రమే లెర్నింగ్ లెసైన్స్ పొందేందుకు అనుమతి లభిస్తుంది. -స్లాట్ నమోదు చేసుకున్న 24 గంటల్లోపు సంబంధిత ఆర్టీఏ కార్యాలయంలో లేదా ఈ సేవా కేంద్రంలో ఫీజు చెల్లించాలి. - టూ వీలర్, ఫోర్ వీలర్లో ఏదైనా ఒకదాని కోసమైతే రూ.60, రెండింటి కోసమైతే రూ.90 చొప్పున ఫీజు చెల్లించాలి. - 24 గంటలలోపు ఫీజు చెల్లించలేకపోతే అభ్యర్థులు బుక్ చేసుకున్న స్లాట్ ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. - స్లాట్ బుక్ చేసుకున్న గడువు, సమయం ప్రకారం ఆర్టీఏ కార్యాలయంలో అధికారులు నిర్వహించే పరీక్షకు హాజరు కావాలి. - ఈ సమయంలో అభ్యర్థులు పుట్టిన తేదీ, చిరునామా ధ్రువీకరణ పత్రాలను వెంట తీసుకెళ్లాలి. - లెర్నింగ్ లెసైన్స్ టెస్టులో ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతా నియమాలు, తదితర అంశాలపై 20 ప్రశ్నలుంటాయి. వీటిలో కనీసం 12 ప్రశ్నలకు 10 నిమిషాల్లో సరైన సమాధానాలు గుర్తించాలి. - అలా గుర్తించిన వారికి మాత్రమే లెర్నింగ్ లెసైన్‌స ఇస్తారు. ఇది ఆరు నెలల వరకు చెల్లుబాటులో ఉంటుంది. - లెర్నింగ్ లెసైన్‌స పొందిన 30 రోజుల తరువాత నుంచి 6 నెలల్లోపు ఎప్పుడైనా శాశ్వత డ్రైవింగ్ లెసైన్స్ తీసుకోవచ్చు. మంజూరు చేసే కేంద్రాలివే.. ఖైరతాబాద్, తిరుమలగిరి, మెహిదీపట్నం, మలక్‌పేట్, బహదూర్‌పురా, అత్తాపూర్, మేడ్చెల్, ఉప్పల్, ఇబ్రహీంపట్నం, కూకట్పల్లి ఆర్టీఏ కార్యాలయాల్లో లెర్నింగ్ లెసైన్‌స పొందవచ్చు. శాశ్వత డ్రైవింగ్ లెసైన్స్ కోసం... శాశ్వత డ్రైవింగ్ లెసైన్స్ కోసం కూడా ఆర్టీఏ వెబ్సైట్ www.telangana transport.org లో స్లాట్ నమోదు చేసుకోవాలి. యథావిధిగా 24 గంటల్లోపు ‘ఈసేవ’లో కానీ, సంబంధిత ఆర్టీఏ కార్యాలయంలో కానీ ఫీజు(రూ.475 నుంచి రూ.525) చెల్లించాలి. నగరంలో నాగోల్, కొండాపూర్, మేడ్చెల్, ఉప్పల్‌లోని డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లో పరీక్ష నిర్వహిస్తారు. మోటారు వాహన నిబంధనల ప్రకారం వాహనాలు నడిపిన వారికే డ్రైవింగ్ లెసైన్స్‌లు అందజేస్తారు. మోటారు వాహన తనిఖీ అధికారి పర్యవేక్షణలో ఈ పరీక్షలు జరుగుతాయి. వాహనదారుడి నైపుణ్యంపై సదరు అధికారి సంతృప్తి చెందితేనే శాశ్వత డ్రైవింగ్ లెసైన్స్ మంజూరవుతుంది. డ్రైవింగ్లెసైన్స్ను పోస్టు ద్వారా అభ్యర్థుల చిరునామాకు పంపిస్తారు. -
ఇక సులువుగా ఎల్ఎల్ఆర్
*రవాణాశాఖ వెబ్సైట్లో ప్రాక్టీస్ పేపర్లు *మాక్ టెస్ట్‌తో పరీక్షించుకునే అవకాశం *దళారులతో పనిలేదు చిత్తూరు (జిల్లాపరిషత్ ), న్యూస్‌లైన్: డ్రైవింగ్ లెసైన్స్ పొందాలంటే ఎల్ఎల్ఆర్ తప్పనిసరి. దానిని పొందాలంటే సామాన్యులు చాలా ఇబ్బంది పడేవారు. దళారులను ఆశ్రయించి సర్టిఫికెట్లు పొందేవారు. అయితే దళారులతో పనిలేకుండా పెద్ద శ్రమ పడకుండా ఎల్ఎల్ఆర్ పొందేందుకు రవాణావాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఎల్ఎల్ఆర్ టెస్ట్‌కు ముందే ఆన్లైన్లో ఉంచిన అవగాహ పేపర్లను ప్రాక్టీస్ చేస్తే పరీక్ష పాసవడం సులువు అంటున్నారు రవాణశాఖ అధికారులు. లెర్నర్స్ లెసైన్స్ సర్టిఫికెట్ పొందేందుకు ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించే టెస్ట్‌కు హాజరుకావాలి. ఈ టెస్ట్‌లో చాలా మంది ఫెయిల్ అయిపోతుంటారు. అధికారుల అంచనా ప్రకారం ఈ సంఖ్య నూటికి 20 శాతం ఉంటుంది. వీరిలో ఎక్కువగా యువత ఆన్లైన్ టెస్ట్ రాసినా పాస్ కాలేకపోతున్నారు. దీనికి భయపడే కొంత మంది యువతీ,యువకులు లెసైన్స్ లేకుండా వాహనాలు కూడా నడిపేస్తున్నారు. అందరికీ అవగాహన కల్పిస్తూ ఎల్ఎల్ఆర్ టెస్ట్‌లో సులువుగా పాస్ అయ్యేందుకు రవాణాశాఖ చర్యలు చేపట్టింది. రవా ణాశాఖ అధికారిక వెబ్సైట్లో ఎల్ఎల్ఆర్ టెస్ట్ ప్రా క్టీస్ పేపర్లను డౌన్‌లోడ్‌చేసుకుని వాటిని ప్రాక్టీస్ చేస్తే సులువుగా టెస్ట్ పాస్ అయ్యే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రాక్టీస్ పేపర్లు పొందేదిలా... www.aptransport.org వెబ్సైట్లో బాటమ్ రైట్, లెఫ్ట్ సైడ్ కార్నర్స్‌లో ఎల్ఎల్ఆర్ ప్రాక్టీస్, మాక్‌టెస్ట్ లింకులు ఉంటాయి. దీనిని ఓపెన్ చేసి పేరు, చిరునామా, ఈమెయిల్ ఐడీ ఇచ్చి యూజర్ నేమ్, పాస్ట్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అనంతరం యూజర్‌నేమ్ ద్వారా పేజీకిలోకి లాగిన్ అవ్వాలి. ఇందులో ప్రాక్టీస్ టెస్ట్, మాక్‌టెస్ట్ పేపర్లు ఉంటాయి. ప్రాక్టీస్ టెస్ట్‌ను క్లిక్ చేస్తే సేవ్ డ్రైవింగ్ ప్రాక్టీసెస్, రోడ్ సైన్స్, మార్కింగ్స్, ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్ రూల్స్, వెహికల్ కంట్రోల్స్ అండ్ మెకానిజమ్స్, మెయిన్టెనెన్స్ అండ్ ఫ్యూయల్ కన్జర్వేషన్, హ్యాడ్లింగ్ ఎమర్జన్సీ డిఫికల్ట్ కండీషన్, లీగల్ ప్రొవిజన్స్ అండ్ ఎంవీ యాక్ట్, యాక్సిడెంట్స్ అండ్ ఫస్ట్ ఎయిడ్, యాటిట్యూడ్, ఆల్కాహాల్ అండ్ డ్రైవింగ్ అనే 9 రకల టెస్ట్ పేపర్లు అందుబాటులోకి వస్తాయి. ఈ 9 పేపర్లలో మొత్తం 827 రకాల ప్రశ్నలు ఉంటాయి. వీటన్నింటినీ ప్రాక్టీస్ చేసిన తర్వాత మాక్ టెస్ట్‌లోకి వెళ్లి ఎంత వరకు నేర్చుకున్నామో పరీక్షించుకోవచ్చు. రవాణా శాఖ కార్యాలయంలో టెస్ట్ ఎలా ఉంటుందో ఇది అలాగే ఉంటుంది. ఈ రెండింటిని బాగా ప్రాక్టీస్ చేస్తే ఎల్ఎల్ఆర్ టెస్ట్‌ను పాస్ కావడం చాలా సులువు. దళారుల ప్రమేయం అవసరంలేదు మామూలుగా ఎల్ఎల్ఆర్ తీసుకోవాలంటే దళారుల ను సంప్రదించాల్సిదేనని అపోహ చాలా మందిలో ఉం ది. నేరుగా పోతే పనికాదు, అధికారుల చుట్టూ తిరగాల్సి ఉంటుందని ప్రచారం ఉంది. ఈ భయంతోనే చాలా మంది ఎల్ఎల్ఆర్, లెసైన్స్ తీసుకోరు. అయితే అలాం టిదేమీ లేకుండా వెబ్సైట్లో ప్రాక్టీస్ చేసుకోవడం ద్వారా ఎల్‌ఎల్‌ఆర్‌ను అందుకోవచ్చు.