*రవాణాశాఖ వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ పేపర్లు
*మాక్ టెస్ట్‌తో పరీక్షించుకునే అవకాశం
*దళారులతో పనిలేదు
చిత్తూరు (జిల్లాపరిషత్ ), న్యూస్‌లైన్: డ్రైవింగ్ లెసైన్స్ పొందాలంటే ఎల్‌ఎల్‌ఆర్ తప్పనిసరి. దానిని పొందాలంటే సామాన్యులు చాలా ఇబ్బంది పడేవారు. దళారులను ఆశ్రయించి సర్టిఫికెట్లు పొందేవారు. అయితే దళారులతో పనిలేకుండా పెద్ద శ్రమ పడకుండా ఎల్‌ఎల్‌ఆర్ పొందేందుకు రవాణావాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఎల్‌ఎల్‌ఆర్ టెస్ట్‌కు ముందే ఆన్‌లైన్‌లో ఉంచిన అవగాహ పేపర్లను ప్రాక్టీస్ చేస్తే పరీక్ష పాసవడం సులువు అంటున్నారు రవాణశాఖ అధికారులు.
లెర్నర్స్ లెసైన్స్ సర్టిఫికెట్ పొందేందుకు ఆర్‌టీఏ కార్యాలయంలో నిర్వహించే టెస్ట్‌కు హాజరుకావాలి. ఈ టెస్ట్‌లో చాలా మంది ఫెయిల్ అయిపోతుంటారు. అధికారుల అంచనా ప్రకారం ఈ సంఖ్య నూటికి 20 శాతం ఉంటుంది. వీరిలో ఎక్కువగా యువత ఆన్‌లైన్ టెస్ట్ రాసినా పాస్ కాలేకపోతున్నారు. దీనికి భయపడే కొంత మంది యువతీ,యువకులు లెసైన్స్ లేకుండా వాహనాలు కూడా నడిపేస్తున్నారు. అందరికీ అవగాహన కల్పిస్తూ ఎల్‌ఎల్‌ఆర్ టెస్ట్‌లో సులువుగా పాస్ అయ్యేందుకు రవాణాశాఖ చర్యలు చేపట్టింది. రవా ణాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఎల్‌ఎల్‌ఆర్ టెస్ట్ ప్రా క్టీస్ పేపర్లను డౌన్‌లోడ్‌చేసుకుని వాటిని ప్రాక్టీస్ చేస్తే సులువుగా టెస్ట్ పాస్ అయ్యే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ప్రాక్టీస్ పేపర్లు పొందేదిలా...
www.aptransport.org వెబ్‌సైట్‌లో బాటమ్ రైట్, లెఫ్ట్ సైడ్ కార్నర్స్‌లో ఎల్‌ఎల్‌ఆర్ ప్రాక్టీస్, మాక్‌టెస్ట్ లింకులు ఉంటాయి. దీనిని ఓపెన్ చేసి పేరు, చిరునామా, ఈమెయిల్ ఐడీ ఇచ్చి యూజర్ నేమ్, పాస్ట్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అనంతరం యూజర్‌నేమ్ ద్వారా పేజీకిలోకి లాగిన్ అవ్వాలి. ఇందులో ప్రాక్టీస్ టెస్ట్, మాక్‌టెస్ట్ పేపర్లు ఉంటాయి. ప్రాక్టీస్ టెస్ట్‌ను క్లిక్ చేస్తే సేవ్ డ్రైవింగ్ ప్రాక్టీసెస్, రోడ్ సైన్స్, మార్కింగ్స్, ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్ రూల్స్, వెహికల్ కంట్రోల్స్ అండ్ మెకానిజమ్స్, మెయిన్‌టెనెన్స్ అండ్ ఫ్యూయల్ కన్‌జర్‌వేషన్, హ్యాడ్లింగ్ ఎమర్జన్సీ డిఫికల్ట్ కండీషన్, లీగల్ ప్రొవిజన్స్ అండ్ ఎంవీ యాక్ట్, యాక్సిడెంట్స్ అండ్ ఫస్ట్ ఎయిడ్, యాటిట్యూడ్, ఆల్కాహాల్ అండ్ డ్రైవింగ్ అనే 9 రకల టెస్ట్ పేపర్లు అందుబాటులోకి వస్తాయి. ఈ 9 పేపర్లలో మొత్తం 827 రకాల ప్రశ్నలు ఉంటాయి. వీటన్నింటినీ ప్రాక్టీస్ చేసిన తర్వాత మాక్ టెస్ట్‌లోకి వెళ్లి ఎంత వరకు నేర్చుకున్నామో పరీక్షించుకోవచ్చు. రవాణా శాఖ కార్యాలయంలో టెస్ట్ ఎలా ఉంటుందో ఇది అలాగే ఉంటుంది. ఈ రెండింటిని బాగా ప్రాక్టీస్ చేస్తే ఎల్‌ఎల్‌ఆర్ టెస్ట్‌ను పాస్ కావడం చాలా సులువు.
దళారుల ప్రమేయం అవసరంలేదు
మామూలుగా ఎల్‌ఎల్‌ఆర్ తీసుకోవాలంటే దళారుల ను సంప్రదించాల్సిదేనని అపోహ చాలా మందిలో ఉం ది. నేరుగా పోతే పనికాదు, అధికారుల చుట్టూ తిరగాల్సి ఉంటుందని ప్రచారం ఉంది. ఈ భయంతోనే చాలా మంది ఎల్‌ఎల్‌ఆర్, లెసైన్స్ తీసుకోరు. అయితే అలాం టిదేమీ లేకుండా వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ చేసుకోవడం ద్వారా ఎల్‌ఎల్‌ఆర్‌ను అందుకోవచ్చు.