స్టైలిస్ గా ఎల్ జీ స్టైలస్ 2 ప్లస్...
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఎల్ జీ తన తాజా స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి గురువారం ఆవిష్కరించింది. ఎల్ జీ స్టైలస్ 2 ప్లస్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ ఫోన్ ధర రూ.24,450గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ప్రపంచవ్యాప్తంగా గత నెలలోనే అందుబాటులోకి తెచ్చామని, ప్రస్తుతం ఈ ఫోన్ ను భారత్ లో ఆవిష్కరించామని ఎల్ జీ ఇండియా మొబైల్స్ మార్కెటింగ్ హెడ్ అమిత్ గుజ్రాల్ తెలిపారు. ఈ ధరల పోటీ ప్రపంచంలో తాము స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని నూతన స్థాయికి తీసుకెళ్లడానికి, స్టైలిస్ అనుభూతితో స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తున్నామని పేర్కొన్నారు.
ఎల్ జీ అంతకు ముందు రబ్బర్ టిప్డ్ పెన్ సీన్ తో తీసుకొచ్చిన ఎల్ జీ జీ4 స్టైలస్ మాదిరిగా కాకుండా, మరింత కచ్చితత్వం కోసం నానో కోటెడ్ టిప్ తో ఈ హ్యాండ్ సెట్ ను తీసుకొచ్చింది. స్టైలస్ ను తొలగిస్తున్నప్పుడు పాప్ అప్ మెనూ కనిపించేలా పెన్ పాప్ నూ ఈ ఫోన్ కలిగి ఉంటుంది.. క్విక్ మెమో, ఆఫ్ మెమో, పాప్ స్కానర్ షార్ట్ కట్ లను కూడా ఈ ఫోన్ కలిగి ఉంటుంది. పెన్ కీపర్ కూడా ఈ ఫోన్ కు ప్రత్యేక ఫీచరే.
స్టైలస్ 2 ప్లస్ ఫీచర్లు...
5.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ ఐపీఎస్ క్వాంటమ్ డిస్ ప్లే
1.4 గిగాహెడ్జ్ ఆక్టా కోర్
క్వాల్ కామ్ నాప్ డ్రాగన్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో
3 జీబీ ర్యామ్
16జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్
200 జీబీ విస్తరణ మెమరీ
16 మెగాపిక్సెల్ వెనుక కెమెరా
8 మెగా పిక్సెల్ ముందుక కెమెరా
3000ఎంఏహెచ్ బ్యాటరీ
4జీ ఎల్ టీతోపాటు వాయిస్ ఓవర్ ఎల్ టీఈ
3జీ, 2జీ కనెక్టివిటీ ఆప్షన్లు
145 గ్రాములు