Li Xuerui
-
ఆ గెలుపే కీలక మలుపు
ముంబై: అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అద్వితీయ విజయాలు సాధించిన హైదరాబాద్ అమ్మాయి, ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు... 2012లో సాధించిన ఓ గెలుపు తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచిందని గుర్తు చేసుకుంది. చైనా ఓపెన్ సందర్భంగా నాటి లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత లీ జురుయ్‌ని ఓడించడం తన ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసిందని చెప్పింది. సీనియర్ విభాగంలో అప్పటివరకు తొలి రౌండ్, క్వాలిఫయర్స్‌లో ఎదురైన ఓటములతో ఆవరించిన నిరాశ ఆ మ్యాచ్ గెలుపుతో ఎగిరిపోయిందని తన కెరీర్ తొలినాళ్లను తలుచుకుంది. నాడు 16 ఏళ్ల సింధు 2012 చైనా మాస్టర్స్ టోర్నీ క్వార్టర్స్‌లో లీ జురుయ్‌పై అద్భుత విజయాన్ని సాధించి వెలుగులోకి వచ్చింది. ఆ మరుసటి ఏడాదే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో తన సత్తాను ప్రపంచానికి చాటింది. ప్రస్తుతం ఆమె ఖాతాలో 5 ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాలతో పాటు, ఒలింపిక్స్ రజతం ఉంది. ‘ఇన్ ద స్పోర్ట్‌లైట్’ షో సందర్భంగా టీటీ ప్లేయర్ ముదిత్ డానీతో సింధు పలు అంశాలపై ముచ్చటించింది. పొరపాటేంటో తెలిసేది కాదు... తొలి నాళ్లలో నా ఆట బాగానే ఉండేది. కానీ అంతర్జాతీయ ప్రమాణాలకు సరితూగకపోయేది. తరచుగా క్వాలిఫయింగ్ , తొలి రౌండ్లలోనే ఓడిపోయేదాన్ని. ఇంకా కష్టపడాలేమో అనుకొని తీవ్రంగా ప్రాక్టీస్ చేసేదాన్ని. అయినా ఓటములు ఎదురయ్యేవి. చాలా నిరాశగా ఉండేది. నా పొరపాటేంటో అర్థమయ్యేది కాదు. మిగతా వారిలాగే కష్టపడ్డా గెలుపు మాత్రం అందకపోయేది. దృక్పథం మారిందలా... 2012లో లండన్ ఒలింపిక్స్ చాంపియన్ చాంపియన్ లీ జురుయ్‌పై గెలవడంతో నా దృక్పథం మొత్తం మారిపోయింది. నా కెరీర్లో అదే టర్నింగ్ పాయింట్. నాటి నుంచి ప్రతీరోజు, ప్రతీ ఏడాదీ నా ఆటను మెరుగు పరుచుకుంటూనే ఉన్నా. బహుమతిగా అభిమాని నెలజీతం... రియోలో నా ప్రదర్శన మెచ్చి నేను హైదరాబాద్ రాగానే ఒకతను తన నెల జీతాన్ని బహుమతిగా ఇవ్వడం ఇంకా గుర్తుంది. అతని అభిమానానికి గుర్తుగా ఒక లేఖతో పాటు కొంత డబ్బు అతనికి పంపించా. -
చైనా మహిళలు పతకం లేకుండానే..!
రియో డి జనీరో: తొలిసారిగా 1992లో జరిగిన బార్సిలోనా ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ గేమ్ ప్రవేశపెట్టినప్పటి నుంచీ ప్రతి ఒలింపిక్స్ లో చైనా మహిళా క్రీడాకారుణులు సత్తాచాటుతున్నారు. అయితే రియో ఒలిపిక్స్ నుంచి మహిళల సింగిల్స్ విభాగంలో పతకం లేకుండా చైనా క్రీడాకారిణులు వెనుదిరగడాన్ని ఆ దేశం జీర్ణించుకోలేక పోతోంది. ఎందుకంటే 20 ఏళ్ల తర్వాత ఓ చైనా ప్లేయర్ పోడియంపై చోటు దక్కించుకోలేక పోవడం గమనార్హం. చివరగా అట్లాంటా ఒలింపిక్స్-1996లో మాత్రమే చైనా మహిళలు సింగిల్స్ లో పతకం లేకుండా ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రతి ఒలింపిక్స్ లో విశేషంగా రాణిస్తూ రెండేసి పతకాలను కొల్లగొడుతూ వచ్చారు. 1992లో అట్లాంటా ఒలింపిక్స్- రెండు కాంస్య పతకాలు, 2000- సిడ్నీ ఒలింపిక్స్ లో స్వర్ణం, కాంస్య పతకాలు, 2004లో ఎథెన్స్ ఒలింపిక్స్ లో స్వర్ణం, కాంస్య పతకాలు, 2008- బీజింగ్ ఒలింపిక్స్ లో స్వర్ణం, రజత పతకాలు, 2012- లండన్ ఒలింపిక్స్ లో స్వర్ణం, రజతాలను చైనా మహిళలు సొంతం చేసుకున్నారు. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. ఈ సారి కాంస్య పతకమైనా దక్కుతుందని చైనా అభిమానులు ఆశపడగా సెమీఫైనల్లో స్వల్పంగా గాయపడ్డ డిఫెండింగ్ ఛాంపియన్, చైనా స్టార్ షట్లర్ ఝరయ్ కాంస్య పతక పోరు నుంచి వైదొలిగింది. దీంతో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో పతకం లేకుండా చైనా ఇంటిదారి పట్టింది. గత నాలుగు ఒలింపిక్స్ లో స్వర్ణాలు తన ఖాతాలో వేసుకున్న చైనా.. రియోలో మాత్రం ఆ దేశ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. 2012 లండన్ ఒలింపిక్స్ లో స్వర్ణాన్ని కొల్లగొట్టిన చైనా ప్లేయర్ లీ ఝరయ్ గాయంతో వైదొలగడంతో చైనా ఖాతా తెరవకుండానే సింగిల్స్ నుంచి నిష్క్రమించింది. మరోవైపు ఫైనల్లో ఎవరు గెలిచినా సంచలనమే. స్పెయిన్, భారత్ రెండు దేశాల ప్లేయర్స్ కు ఈ విభాగంలో స్వర్ణాలు రాలేదు. ఇప్పటికే కాంస్యం దక్కించుకున్న ఒకుహార జపాన్ తరఫున పతకం నెగ్గిన తొలి ప్లేయర్ గా రికార్డు సృష్టించింది. శుక్రవారం సాయంత్రం స్వర్ణం కోసం స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ తో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తలపడనున్న విషయం తెలిసిందే. -
జపాన్ ప్లేయర్ ఒకుహారకు కాంస్యం
జపాన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఒకుహార చాలా అదృష్టవంతురాలు. మ్యాచ్ ఆడకుండానే కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. షెడ్యూల్ ప్రకారం.. రియో ఒలింపిక్స్ లో భాగంగా కాంస్యం కోసం నేటి సాయంత్రం చైనా స్టార్ షట్లర్ లీ ఝురయ్తో మ్యాచ్‌లో ఒకహార తలపడాల్సి ఉంది. అయితే గురువారం జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ ప్లేయర్ కరోలినా మారిన్ తో ఆడుతున్న సందర్భంగా లీ ఝురయ్ స్వల్పంగా గాయపడింది. మ్యాచ్ నుంచి వైదొలగకుండా ఝురయ్ అలాగే పోరాడి 21-14, 21-16 తేడాతో మారిన్ చేతితో ఓటమి పాలైన విషయం తెలిసిందే. గాయం కారణంగా విశ్రాంతి తీసుకోవాలని ఝురయ్ తన నిర్ణయాన్ని ప్రకటించడంతో ఎలాంటి పోరు లేకుండానే ఒకుహార కాంస్య పతకాన్ని దక్కించుకుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో సెమీఫైనల్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చేతిలో 21-19, 21-10తో ఓటమిపాలైన ఒకుహారకు కాంస్యం దక్కడం ఊరటనిచ్చే అంశమే. ఒకవేళ చైనా స్టార్ ఝరయ్ ఫిట్ గా ఉన్నట్లయితే ఒకుహార కాంస్యం నెగ్గడం అంత తేలిక కాదని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. -
క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధూ
జకర్తా: భారత్ స్టార్ షట్లర్ పీవీ సింధూ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ రోజు జరిగిన ప్రీ క్వార్టర్స్ మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణి లీ ఝురయ్పై 21-17, 14-21, 21-17 తేడాతో విజయం సాధించింది. సింధూ కెరీర్ లో ఇది ఆమెకు అతిపెద్ద విజయం. 50 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 11వ సీడ్ ప్లేయర్ సింధూ తొలి, మూడో సెట్లను అలవోకగా గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గత రెండు చాంపియన్‌షిప్ లలో కాంస్య పతకాలు సాధించిన సింధూ ఈ ఏడాది కూడా పతకం నెగ్గాలనే ధీమాతో ప్రత్యర్ధులను ఎదుర్కొంటుంది. క్వార్టర్స్ మ్యాచ్ గెలిస్తే ఆ తర్వాత సింధూకు కష్టమైన డ్రా ఎదురయ్యే అవకాశముంది. స్పెయిన్ కు చెందిన క్రీడాకారిణి టాప్ సీడ్, ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ కరోలినా మరిన్ లేదా చైనాకు చెందిన ప్లేయర్ వాంగ్ షిగ్జేయిన్ తో తలపడాల్సి వస్తుంది.