జీవిత బీమాతో కుటుంబానికి ఆర్థిక భరోసా
రాజంపేట టౌన్: ఎల్ఐసీలో పాలసీ తీసుకోవడం వల్ల ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి ఎంతో ఆర్దిక భరోసా ఉంటుందని రాజంపేట జీవిత బీమా సంస్థ మేనేజర్ జీ.జాన్‌విక్టర్ తెలిపారు. స్థానిక ఎల్ఐసీ కార్యాలయంలో ఆదివారం లియాఫీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జీవిత బీమా సంస్థకు ఏజెంట్లు మూలస్థంభాల్లాంటి వారన్నారు. ఏజెంట్ల కృషి వల్లే భారతదేశంలో జీవిత బీమా సంస్థ అగ్రగామిగా ఉందని తెలిపారు. అంతకు ముందుగా ఎల్ఐసీ కార్యాలయం ఆవరణలో లియాఫీ జెండాను లియాఫీ అధ్యక్షుడు దండే సుబ్రమణ్యం ఆధ్వర్యంలో ఎగురవేశారు. ఈకార్యక్రమాల్లో లియాఫీ అధ్యక్షుడు దండే సుబ్రమణ్యం, కార్యదర్శి వసంతరాజు, కోశాధికారి జీ.రాజశేఖర్‌రాజు, సభ్యులు శంకర్‌నారాయణ, చల్లా గుర్రప్ప, టీ.నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు.