భార్యను 'ఈబే'లో అమ్మకానికి పెట్టాడు
లండన్: తన భార్యకు జాలి, దయ లాంటివి ఏవీ లేవంటూ.. ఓ వ్యక్తి ఆమెను ఈబే లో అమ్మకానికి పెట్టాడు. యూకేలోని యార్క్ షైర్ కు చెందిన సిమన్ ఓ కేన్, లియాండ్రా భార్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వృత్తిపరంగా టెలికాం ఇంజనీర్ గా పనిచేసే సిమన్ అలసిపోయి ఇంటికి వస్తుంటాడు. ఆ సమయంలో తన భార్య కనీసం తనపై జాలి కూడా చూపడం లేదని అమ్మకానికి ఉంచిన పోస్టులో వాపోయాడు.
జాలి, దయ, కరుణ లేని భార్య తనకు వద్దని, అందుకే ఆమెను అమ్మకానికి పెడుతున్నట్లు ఈబేలో పోస్టు పెట్టాడు. తన భార్య చాలా అందంగా ఉంటుందని, వంట కూడా బాగా చేస్తుందని పోస్టులో పేర్కొన్నాడు. కానీ వంట సరిగ్గా కుదరనప్పుడు ఆసుపత్రికి వెళ్లాల్సివస్తుందని చెప్పాడు. సిమన్ చేసిన పోస్టుకు 68,880పౌండ్లకు లియాండ్రాను కొనడానికి సిద్ధమని ఓ వ్యక్తి బిడ్ చేశాడు. పోస్టు గురించి తర్వాతి రోజు లియాండ్రాకు తెలియడంతో ఆమె తనను చంపాలని చూస్తోందని సిమన్ చెప్పాడు.