licensed pistol
-
ఆత్మరక్షణకు గన్ లైసెన్స్ ఇవ్వండి
హన్మకొండ చౌరస్తా: ఇటీవల మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతోన్న నేపథ్యంలో ఆత్మరక్షణ కోసం గన్ లైసెన్స్ మంజూరు చేయాలని ఓ అధ్యాపకురాలు పోలీసులకు అర్జీ పెట్టుకుంది. దీనికి సంబంధించిన విజ్ఞాపన పత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెలుగులోకి వచ్చింది. గిరిజన సంక్షేమ మహిళల డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నా నంటూ.. తన పేరు నౌషీన్ ఫాతిమాగా కమిషనర్‌కు ఇచ్చిన అర్జీలో ఆమె పేర్కొంది. కేవలం ఈ–మెయిల్ ఐడీని మాత్రమే పేర్కొన్న నౌషీన్ ఫాతిమా ఇతర వివరాలను వెల్లడించలేదు. ఉద్యోగరీత్యా నిత్యం ఖమ్మం జిల్లాకు ఒంటరిగా ప్రయాణిస్తానని, తెల్లవారుజామున ఇంటి నుంచి బయలుదేరితే తిరిగి వచ్చేసరికి రాత్రి అవుతుందని పేర్కొంది. ఈ నెల 28న మానస హత్య జరిగిన ప్రాంతానికి సమీపంలోనే తన ఇల్లు ఉందని, నిత్యం అదే మార్గంలో వెళ్తానంటూ తెలిపింది. ప్రియాంకారెడ్డి, మానసపై జరిగిన అఘాయిత్యాలు ఇతర మహిళలపైనా జరగొచ్చని, అత్యవసర పరిస్థితుల్లో 100 నంబర్‌కు ఫోన్ చేసినా, మొబైల్ యాప్ ద్వారా తక్షణ సహాయం కోరినా పోలీసులు రక్షిస్తారన్న నమ్మకం లేదని దరఖాస్తులో పేర్కొంది. మానవ మృగాల మధ్యలో ఉంటూ ప్రతిక్షణం నన్ను నేను కాపాడుకోవాలంటే రివాల్వర్ కలిగి ఉండటమే సురక్షిత మార్గమని నమ్ముతున్నట్లు వివరించింది. ‘అతడిని శిక్షించి ఉంటే ఈ ఘటనలు జరిగేవి కావు’ సాక్షి, హైదరాబాద్: హాజీపూర్ వరుస హత్యల నిందితుడిని కఠినంగా శిక్షించి ఉంటే ప్రియాంకారెడ్డి, మానస హత్యలు జరిగేవి కావని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. మహిళలు, బాలికల హత్యల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రియాంకారెడ్డి హత్యోదంతంపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిచే విచారణ జరిపించి నిందితులను బహిరంగంగా ఉరి తీయాలన్నారు. ఇకనైనా మద్య నిషేధం అమలు చేయాలని కోరారు. -
తాలిబన్లపై పాక్ ప్రొఫెసర్ సాహసం
పెషావర్: తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురు కూడా ప్రేమకు నిలయాలు అని చెప్తుంటారు. తల్లిదండ్రులకు తమ పిల్లలపై ఎంత ప్రేమ ఉంటుందో వారు పెరుగుతున్న క్రమంలో విద్యాబుద్ధులు అందించే ఉపాధ్యాయులకు కూడా అంతకుమించిన ప్రేమ ఉంటుందని అంటారు. పాకిస్థాన్‌లో ఓ ప్రొఫెసర్ అదే విషయాన్ని రుజువు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేస్తున్నారని తెలిస్తేనే ఆ ప్రాంతాన్ని వదిలి ప్రాణాలు అరచేతబట్టుకొని పారిపోయే ఈ రోజుల్లో ఆ ప్రొఫెసర్ మాత్రం తన విద్యార్థులను కాపాడేందుకు తన ప్రాణాలు అడ్డుగా పెట్టాడు. ఏకంగా భారీ తుపాకులతో దూసుకొస్తున్న ఉగ్రవాదులను నిలువరించేందుకు ఓ సైనికుడిలాగా మారి తన లైసెన్స్ తుపాకీతో వారికి ఎదురు నిలిచాడు. తన దగ్గర తుపాకీతో కాల్పులు జరిపి ఆ ముష్కరులను ఎదుర్కొనే లోపే వారు తెగబడ్డారు. ఆ ప్రొఫెసర్ పై తూటాల వర్షం కురిపించారు. దీంతో 30 ఏళ్ల ప్రాయంలోనే అతడు కన్నుమూశాడు. పాకిస్థాన్‌లో ఖైబర్ పక్తున్ ఖ్వా ప్రావిన్స్‌లోని బచాఖాన్ యూనివర్సిటీలోకి 12 మంది సాయుధులైన ఉగ్రవాదులు బుధవారం చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 24మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి సమయంలోనే రసాయన శాస్త్రం బోధించే ప్రొఫెసర్ సయ్యద్ హమీద్ హుస్సేన్ (34) తన లైసెన్స్ రివాల్వర్ తో అడ్డుకునే ప్రయత్నం చేసి ప్రాణాలువదిలాడు. ఆయన ప్రాణం కోల్పోయిన తీరును ఆ వర్సిటీ జువాలజీ విద్యార్థి తెలుపుతూ 'ముందు కాల్పుల చప్పుళ్లు వినగానే మా కెమిస్ట్రీ ప్రొఫెసర్ తానుచెప్పే వరకు భవనం వెలుపలికి రావొద్దని హెచ్చరించారు. అనంతరం ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు తన తుపాకీ తీశారు. నేను చూస్తుండగానే ఆయనకు బుల్లెట్ తాకింది. ఆయన కూడా కాల్పులు జరిపారు. అయితే, అంతకంటే వేగంగా ఉగ్రవాదులు తూటాల వర్షం కురిపించడంతో నేను గోడ దూకి పారిపోయాను. మిగితా వాళ్లు కూడా అలాగే చేశారు. మా ప్రొఫెసర్ తో సహా 25మంది ప్రాణాలు విడిచారు' అని అతడు వివరించాడు.