life prisonment
-
హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు
విజయనగరం లీగల్: భార్యను హతమార్చడంతోపాటు సాక్ష్యాలను తారుమారు చేశాడన్న ఆరోపణలు రుజువు కావడంతో కృష్ణా జిల్లా చర్లపల్లి మండలం కూచిపూడి గ్రామానికి చెందిన గురివిందపల్లి నాగరాజుకు జీవితఖైదుతో పాటు రూ. 20 వేల జరిమానా విధిస్తూ జిల్లా సెషన్స్ జడ్జి ఆలపాటి గిరిధర్ సోమవారం తీర్పుచెప్పారు. అలాగే హతురాలి కుటుంబ సభ్యులకు నాలుగు లక్షల రూపాయలు నష్ట పరి హారం చెల్లించాల్సిందిగా తీర్పులో పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ వారు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. 2006లో నాగరాజు తన పొరుగూరు రామ్‌నగర్ గ్రామానికి చెందిన రాధను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చాడు. అక్కడే వారికి బాబు పుట్టాడు. రెండు నెలల అనంతరం బాబును అత్తవారింట వదలి భార్యతో విజయనగరం వచ్చి స్థానిక దాసన్నపేటలో ఉన్న డాల్ఫిన్ హైట్స్ అపార్ట్మెంట్లో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. మూడు నెలల పాటు బాగానే ఉన్న నాగరాజు తన భార్యను ఎలా గైనా వదలించుకోవాలన్న ఉద్దేశంతో శారీరకంగా, మానసికంగా వేధించసాగాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడకు కొన్నాళ్ల తర్వాత ఇరువర్గాల పెద్ద మనుషులు భార్యభర్తల ను రాజీ చేయడంతో, నాగరాజు తన భార్యను 2014 అక్టోబర్ 27న విజయనగరం తీసుకువచ్చాడు. అదే నెల 30వ తేదీ రాత్రి భార్యతో గొడవపడి విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం రాధ ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించి ఇరుగుపొరుగు వారిని నమ్మించాడు. అత్తవారికి కూడా తన భార్య ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందించాడు. స్థానికుల సహాయంతో 108 వాహనంలో రాధను కేంద్రాస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారిం చారు. దీంతో గుట్టుచప్పుడు కాకుండా భార్య మృతదేహాన్ని కారులో అత్తవారి గ్రామమైన రామ్‌నగర్‌కు తీసుకువెళ్లిపోయాడు. అక్కడ వారి సంప్రదాయ ప్రకారం మృతదేహాన్ని ఖననం చేశారు. ఖననం చేసే సమయంలో ఆమె శరీరంపై ఉన్న గాయాలను గుర్తించిన సోదరుడు కృష్ణబాబు విజయనగరం రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన అప్పటి సీఐ కోరాడ రామారావు దర్యాప్తు ప్రారంభిం చారు. దర్యాప్తులో నాగరాజు తన భార్యను ఉద్దేశ్యపూర్వకంగానే హతమార్చి, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించాడని వెల్లడైంది. అలాగే తన భర్త వేధింపులు గురిచేస్తున్నట్లు ఆమె రాసిన లెటర్ కూడా పోలీసులకు లభించింది. దీంతో 2011 నవంబ రు 6వతేదీన నాగరాజును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాధారాలతో కేసు రుజువు చేయడంతో జడ్జి జీవిత ఖైదు విధించారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్‌ప్రాసిక్యూటర్లు వై.పరశురామ్, పృథ్వీరాజ్‌లు వాదించారు. -
జంట హత్యల కేసులో 9 మందికి జీవితఖైదు
ప్రకాశం(మార్కాపురం): జంట హత్యల కేసులో మార్కాపురం జిల్లా ఆరో అదనపు న్యాయస్థానంతొమ్మిది మందికి జీవితఖైదు విధించింది. వివరాలు.. మార్కాపురం మండలం అమ్మవారిపల్లి గ్రామంలోఆస్తి తగాదాల నేపధ్యంలో 2010, డిసెంబర్ 28న కురుకుంద శ్రీనివాసులు, కురుకుంద చిన్నవెంకటయ్య అనే ఇద్దరు వ్యక్తులను దారుణంగా బంధువులే హతమార్చారు. హత్య అనంతరం ఈ కేసుకి సంబంధించి తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. నాలుగున్నరేళ్ల అనంతరం వీరికి శిక్ష విధించారు. శిక్షపడిన వారిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. -
అబూసలేంకు జీవితఖైదు
ముంబై: ఇరవైఏళ్ల నాటి బిల్డర్ ప్రదీప్ జైన్ హత్యకేసులో గ్యాంగ్‌స్టర్ అబూసలేంకు జీవితఖైదు పడింది. ఈ మేరకు శిక్ష ఖరారు చేస్తూ ముంబైలోని టాడా ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో సలేం మాజీ డ్రైవర్ మెహందీ హసన్‌కు సైతం జీవితఖైదు విధించింది. మరో నిందితుడు వీరేంద్ర జాంబ్(86)కు శిక్ష విషయంలో కాస్త ఊరట లభించింది. విచారణ సందర్భంగా వీరేంద్ర జైలులో గడిపిన సమయాన్ని శిక్ష నుంచి మినహాయించారు. పోర్చుగల్‌తో భారత ప్రభుత్వం కుదుర్చుకున్న ఖైదీల పరస్పర అప్పగింత ఒప్పందం ప్రకారం సలేంకు ఉరిశిక్షగానీ, 25ఏళ్లకు మించిన జైలు శిక్షగానీ విధించడానికి వీలు లేదని వాదనల సందర్భంగా సలేం తరపు న్యాయవాది సుదీప్ పస్బోలా వాదించారు. -
మహిళ హత్యకేసులో ఒకరికి జీవితఖైదు
రంగారెడ్డి: డబ్బు కోసం ఓ యువతిని హత్య చేసిన నిందితునికి జీవితఖైదుతో పాటు రూ. వెయ్యి జరిమానా విధిస్తూ 3వ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జీ గురువారం తీర్పునిచ్చారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేష్ కథనం ప్రకారం... కర్మన్‌ఘాట్ శ్రీనిధికాలనీలో నివాసముండే శ్వేత అక్క వద్ద ఉంటూ చదువుకుంటోంది. జనవరి 27, 2009న దూరపు బంధువైన శేఖర్‌రెడ్డి శ్వేత ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో డబ్బుల విషయంలో శ్వేత, శేఖర్‌రెడ్డిల మధ్య గొడవ జరిగింది. దీంతో క్షణికావేశానికి లోనైన శేఖర్‌రెడ్డి బీరు బాటిల్, ఐరన్ రాడ్‌తో శ్వేత తలపై మోది హతమార్చాడు. విషయం తెలుసుకున్న శ్వేత సోదరుడు క్రాంతికుమార్‌రెడ్డి సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడైన శేఖర్‌రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించి కోర్టులో అభియోగపత్రం నమోదు చేశారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 6వ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జీ జస్టిస్ వెంకటప్రసాద్ నిందితుడికి జీవితఖైదుతో పాటు జరిమానా విధించారు. -
అత్యాచారం, హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు
రంగారెడ్డి జిల్లా కోర్టులు : మహిళపై లైంగిక దాడికి పాల్పడి ఆమెను హత్య చేసిన ఇద్దరు నిందితులకు జీవితఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ. వెయ్యి జరిమానా విధిస్తూ 3వ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జీ బుధవారం తీర్పునిచ్చారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి... రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్ ప్రాంతంలో నివాసముండే రతలావత్ సోమ్లీ 2012 నవంబరు, 11న టోలీచౌకి లేబర్ అడ్డా వద్ద కూలీపని కోసం రాగా అదే ప్రాంతంలో నివాసముండే లక్ష్మీకాంత్, బలరాంరాజులు ఆ మపని ఉందని చెప్పి ఓ కాంపౌండ్ వాల్ ఉన్న గదిలోకి తీసుకెళ్లి ముగ్గురు కలిసి మద్యం సేవించారు. ఆ తరువాత నిందితులైన లక్ష్మీకాంత్, బలరాంరాజులు మహిళపై లైంగిక దాడికి పాల్పడి తరువాత బండరాయితో తలపై మోది హత్య చేశారు. అనంతరం మహిళ ఒంటిపై ఉన్న వెండి ఆభరణాలను తీసుకుని పారిపోయారు. ఇంటి యజమాని అజీం ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా 2012 నవంబరు 20న నిందితులైన లక్ష్మీకాంత్, బలరాంరాజులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించి కోర్టులో అభియోగపత్రం నమోదు చేశారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 3వ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జీ వెంకటప్రసాద్ నిందితులకు జీవితఖైదుతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.