అత్యాచారం, హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు | 2 people life prisoned and penalty | Sakshi
Sakshi News home page

అత్యాచారం, హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

Published Wed, Feb 11 2015 11:39 PM | Last Updated on Sat, Jul 28 2018 8:44 PM

2 people life prisoned and penalty

రంగారెడ్డి జిల్లా కోర్టులు : మహిళపై లైంగిక దాడికి పాల్పడి ఆమెను హత్య చేసిన ఇద్దరు నిందితులకు జీవితఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ. వెయ్యి జరిమానా విధిస్తూ 3వ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జీ బుధవారం తీర్పునిచ్చారు.

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి... రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్ ప్రాంతంలో నివాసముండే రతలావత్ సోమ్లీ 2012 నవంబరు, 11న టోలీచౌకి లేబర్ అడ్డా వద్ద కూలీపని కోసం రాగా అదే ప్రాంతంలో నివాసముండే లక్ష్మీకాంత్, బలరాంరాజులు ఆ మపని ఉందని చెప్పి ఓ కాంపౌండ్ వాల్ ఉన్న గదిలోకి తీసుకెళ్లి ముగ్గురు కలిసి మద్యం సేవించారు. ఆ తరువాత నిందితులైన లక్ష్మీకాంత్, బలరాంరాజులు మహిళపై లైంగిక దాడికి పాల్పడి తరువాత బండరాయితో తలపై మోది హత్య చేశారు. అనంతరం మహిళ ఒంటిపై ఉన్న వెండి ఆభరణాలను తీసుకుని పారిపోయారు.

ఇంటి యజమాని అజీం ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా 2012 నవంబరు 20న నిందితులైన లక్ష్మీకాంత్, బలరాంరాజులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించి కోర్టులో అభియోగపత్రం నమోదు చేశారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 3వ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జీ వెంకటప్రసాద్ నిందితులకు జీవితఖైదుతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement