అబూసలేంకు జీవితఖైదు | life prisonment for abusalem | Sakshi
Sakshi News home page

అబూసలేంకు జీవితఖైదు

Published Thu, Feb 26 2015 1:57 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM

అబూసలేంకు జీవితఖైదు

అబూసలేంకు జీవితఖైదు

 ముంబై: ఇరవైఏళ్ల నాటి బిల్డర్ ప్రదీప్ జైన్ హత్యకేసులో గ్యాంగ్‌స్టర్ అబూసలేంకు జీవితఖైదు పడింది. ఈ మేరకు శిక్ష ఖరారు చేస్తూ ముంబైలోని టాడా ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో సలేం మాజీ డ్రైవర్ మెహందీ హసన్‌కు సైతం జీవితఖైదు విధించింది. మరో నిందితుడు వీరేంద్ర జాంబ్(86)కు శిక్ష విషయంలో కాస్త ఊరట లభించింది.

విచారణ సందర్భంగా వీరేంద్ర జైలులో గడిపిన సమయాన్ని శిక్ష నుంచి మినహాయించారు. పోర్చుగల్‌తో భారత ప్రభుత్వం కుదుర్చుకున్న ఖైదీల పరస్పర అప్పగింత ఒప్పందం ప్రకారం సలేంకు  ఉరిశిక్షగానీ, 25ఏళ్లకు మించిన జైలు శిక్షగానీ విధించడానికి వీలు లేదని వాదనల సందర్భంగా సలేం తరపు న్యాయవాది సుదీప్ పస్బోలా వాదించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement