abusalem
-
అబూసలేంకు ఏడేళ్ల జైలుశిక్ష
న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ అబూసలేంకు ఢిల్లీలోని ఓ కోర్టు గురువారం ఏడేళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. 2002లో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త అశోక్ గుప్తాను రూ.5 కోట్ల ప్రొటెక్షన్ మనీ ఇవ్వాలని బెదిరించిన కేసులో సలేంను కోర్టు మే 26న కోర్టు దోషిగా తేల్చింది. ఇరుపక్షాల వాదనలు విన్న అదనపు సెషన్స్ జడ్జిæ.. సలేంకు ఏడేళ్ల కఠిన కారాగాశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న చంచల్ మెహతా, మాజిద్ ఖాన్, పవన్, మొహమ్మద్ అష్రఫ్‌లను నిర్దోషులుగా విడుదల చేశారు. 1993 ముంబై పేలుళ్ల కేసు సహా పలు నేరాలు చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సలేం నవీముంబైలోని తలోజా జైలులో ఉన్నాడు. -
అబూసలేంకు జీవితఖైదు
ముంబై: ఇరవైఏళ్ల నాటి బిల్డర్ ప్రదీప్ జైన్ హత్యకేసులో గ్యాంగ్‌స్టర్ అబూసలేంకు జీవితఖైదు పడింది. ఈ మేరకు శిక్ష ఖరారు చేస్తూ ముంబైలోని టాడా ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో సలేం మాజీ డ్రైవర్ మెహందీ హసన్‌కు సైతం జీవితఖైదు విధించింది. మరో నిందితుడు వీరేంద్ర జాంబ్(86)కు శిక్ష విషయంలో కాస్త ఊరట లభించింది. విచారణ సందర్భంగా వీరేంద్ర జైలులో గడిపిన సమయాన్ని శిక్ష నుంచి మినహాయించారు. పోర్చుగల్‌తో భారత ప్రభుత్వం కుదుర్చుకున్న ఖైదీల పరస్పర అప్పగింత ఒప్పందం ప్రకారం సలేంకు ఉరిశిక్షగానీ, 25ఏళ్లకు మించిన జైలు శిక్షగానీ విధించడానికి వీలు లేదని వాదనల సందర్భంగా సలేం తరపు న్యాయవాది సుదీప్ పస్బోలా వాదించారు. -
అబూసలేంకు జీవిత ఖైదు
మాఫీయా డాన్ అబూసలేంకు జీవిత కారాగార శిక్ష పడింది. 1995నాటి బిల్డర్ ప్రదీప్ జైన్ హత్య కేసుకు సంబంధించి బుధవారం టాడా కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. ప్రదీప్ అతడి సోదరుడు సునీల్‌తోపాటు పలువురు బిల్డర్లను సలేం బెదిరించి భయకంపనలు సృష్టించాడని కోర్టు నిర్ధారించింది. ఆస్తులపై హక్కులివ్వకపోతే కోటి రూపాయలు ఇవ్వాలని బెదిరించి ఒప్పందం చేసుకున్నారన్నారు. ప్రదీప్ తొలుత పది లక్షలు ఇచ్చారని, మిగిలిన మొత్తం ఇవ్వకపోవడంతో 1995, మార్చి 7న జుహూ బంగళా బయట జైన్‌ను తుపాకీతో కాల్చి చంపారని కోర్టు పేర్కొంది. ఈ కేసులో మరో ఇద్దరు కూడా దోషులున్నారు. -
బిల్డర్ హత్య కేసులో దోషిగా అబూ సలేం
ముంబై: 1995నాటి బిల్డర్ ప్రదీప్ జైన్ హత్యకేసులో గ్యాంగ్‌స్టర్ అబూసలేంతోపాటు మరో ఇద్దరిని ఇక్కడి ప్రత్యేక టాడా కోర్టు దోషులుగా నిర్ధారించింది. ప్రదీప్ జైన్, అతడి సోదరుడు సునీల్‌తోపాటు బిల్డర్లను డబ్బుకోసం బెదిరించి సలేం భయకంపనలు సృష్టించాడని టాడా కోర్టు జడ్జి జీఏ సనప్ సోమవారం చెప్పారు. ఈ కేసులో శిక్షలపై మంగళవారం కోర్టులో వాదనలు జరిగే అవకాశముంది. సలేంతోపాటు వీరేంద్ర జాంబ్, మెహందీ హసన్‌లను ఐపీసీ సెక్షన్ 302 (హత్య), 120బీ (కుట్ర)లతోపాటు టాడాలోని సంబంధిత సెక్షన్ల కింద దోషులుగా నిర్ధారించినట్లు ప్రత్యేక ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ చెప్పారు. భారత్ బయట కుట్రపన్ని ఇక్కడ దోషిగా నిరూపితమవడం ఈ కేసులోనే తొలిసారన్నారు. 1994 అక్టోబర్‌లో దుబాయ్‌లో సలేం, ఖాన్, హసన్, కయ్యూమ్ అన్సారీ, డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్ కస్కర్లు జైన్ సోదరుల ఆస్తులపై కన్నేసి బెదిరించారని జడ్జి పేర్కొన్నారు. ఆస్తులపై హక్కులివ్వకపోతే కోటి రూపాయలు ఇవ్వాలని బెదిరించి ఒప్పందం చేసుకున్నారన్నారు. ప్రదీప్ తొలుత పది లక్షలు ఇచ్చారని, మిగిలిన మొత్తం ఇవ్వకపోవడంతో 1995, మార్చి 7న జుహూ బంగళా బయట జైన్‌ను తుపాకీతో కాల్చి చంపారన్నారు. -
అబూసలేంపై కాల్పులు