
న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ అబూసలేంకు ఢిల్లీలోని ఓ కోర్టు గురువారం ఏడేళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. 2002లో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త అశోక్ గుప్తాను రూ.5 కోట్ల ప్రొటెక్షన్ మనీ ఇవ్వాలని బెదిరించిన కేసులో సలేంను కోర్టు మే 26న కోర్టు దోషిగా తేల్చింది. ఇరుపక్షాల వాదనలు విన్న అదనపు సెషన్స్ జడ్జిæ.. సలేంకు ఏడేళ్ల కఠిన కారాగాశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న చంచల్ మెహతా, మాజిద్ ఖాన్, పవన్, మొహమ్మద్ అష్రఫ్‌లను నిర్దోషులుగా విడుదల చేశారు. 1993 ముంబై పేలుళ్ల కేసు సహా పలు నేరాలు చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సలేం నవీముంబైలోని తలోజా జైలులో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment