నకిలీ బాబా బురిడీ కేసులో మరో ట్విస్ట్
హైదరాబాద్: లైఫ్‌స్టైల్ బిల్డింగ్ యజమాని మధుసూదన్‌రెడ్డిని నకిలీ బాబా బురిడీ కొట్టించిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బుధవారం ఉదయం10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వారి ఇంటిలో పూజలు నిర్వహించాడు. అనంతరం మధుసూదన్ రెడ్డి కుమారుడు సందేశ్రెడ్డితో కలిసి నకిలీ బాబా పూజలో పెట్టించిన రూ.కోటి ముప్పై లక్షల డబ్బును తమతో పాటు తీసుకెళ్లాడు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న ఆలయాల్లో బాబా పూజలు చేసి...బంజారాహిల్స్‌లో బస చేసిన హోటల్‌కు వెళ్లారు.
ఆ సమయంలో సందేశ్రెడ్డి కళ్లు తిరుగుతున్నాయని బాబాకు చెప్పడంతో, విశాంత్రి తీసుకోవాలని మాయ మాటలు చెప్పిన బురిడీ బాబా కారు కీని దొంగిలించి.. కారులోని డబ్బు మూటను తీసుకుని ఉడాయించాడు. కొంతసేపటి తర్వాత తేరుకున్న సందేశ్ సాయంత్రం 5గంటల సమయంలో ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే ఇంట్లోని అతని తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించిన సందేశ్రెడ్డి వారిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వెంటనే జరిగిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.