'కేసీఆర్‌కు జడ్‌ప్లస్ రక్షణ కల్పించాలి'
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై హత్యాయత్నం కుట్ర విషయంలో ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి, డీజీపీ ఎందుకు స్పందించటం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, విద్యాసాగర్‌రావు సూటిగా ప్రశ్నలు సంధించారు. కేసీఆర్‌కు తక్షణమే జెడ్‌ప్లస్ రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాకుండా అల్లకల్లోలం సృష్టించడానికి కొందరు కుట్ర పన్నుతున్నారని కొప్పుల, విద్యాసాగర్ రావు ఆరోపించారు.
కెసిఆర్ హత్యకు కుట్ర జరుగుతుందనే విషయాన్ని మూడు రోజుల కిందట పోలీసు ఇంటెలిజెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసినా, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఆపార్టీ నేతలు హరీష్ రావు, ఈటెల నిన్న విమర్శించిన విషయం తెలిసిందే.