వైఎస్‌ను రైతులు మరువరు
ఎత్తిపోతల భవన శంకుస్థాపనలో ఎమ్మెల్యే ఆర్కే
మంగళగిరి : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని ఈ ప్రాంత రైతులు ఎన్నటికీ మరవరని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) అన్నారు. మండలంలోని నిడమర్రు గ్రామంలో ఎత్తిపోతల పథకానికి రూ.5 లక్షలతో నిర్మించనున్న నూతన భవన కార్యాలయానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2004లో రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించిన నిడమర్రు ఎత్తిపోతల పథకం వల్ల చుట్టుపక్కల గ్రామాల రైతులు మూడు వేల ఎకరాల్లో సాగుచేసుకుంటున్నారని చెప్పారు. రైతులు బాధలు తన కంటితో చూసిన వైఎస్సార్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వెంటనే ఉచిత విద్యుత్ పథకం అమలు చేయడంతోపాటు రుణమాఫీ చేశారని గుర్తుచేశారు.
నేడు రైతులు గిట్టుబాటు ధరల్లేక పెట్టుబడులు పెరిగిపోయి వ్యవసాయం చేసేందుకు ఇబ్బం దులు పడుతుంటే అమలుకు సాధ్యం కాని వాగ్దానాలతో గద్దెనెక్కిన చంద్రబాబు.. రుణమాఫీపై కాలయాపన చేస్తున్నారని విమర్శిం చారు. బ్యాంకుల నుంచి రైతులకు వస్తున్న నోటీసులకు ఏమని సమాధానం చెబుతారని ఆర్కే ప్రశ్నించారు. కార్యక్రమంలో సర్పంచ్ మండెపూడి మణెమ్మ, ఉపసర్పంచ్ గాదె సాగర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, కొదమగుండ్ల నాగరత్నం, ఎత్తిపోతల పథకం ఛైర్మన్ శివన్నారాయణరెడ్డి, సభ్యులు గాదె వీరాంజనేయరెడ్డి, గాదె సాంబిరెడ్డి, మర్రెడ్డి సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్‌లు గాదె లక్ష్మారెడ్డి, నాయకులు భీమవరపు సాంబిరెడ్డి, కొల్లి శేషిరెడ్డి, కంఠం నరేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.