light earthquake
-
శ్రీకాకుళం జిల్లాలో స్వల్ప భూకంపం
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో బుధవారం స్వల్ప భూకంపం వచ్చింది. జిల్లాలోని ఎచ్చర్ల, లావేరు మండలాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దాని ప్రభావంతో భూమి రెండు సెకన్లపాటు కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలోని జనం అంతా భయంతో బయటకు పరుగులు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చిత్తూరు జిల్లాలో స్వల్ప భూకంపం
సోమల(చిత్తూరు): చిత్తూరు జిల్లా సోమల మండలం ఆవులపల్లె పంచాయతీ రామకష్ణాపురంలో బుధవారం స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఉన్నట్టుండి భీకర శబ్ధం రావడంతో వ్యవసాయ పొలాల వద్ద పనులు చేసుకుంటున్న రైతులు ఉలిక్కిపడ్డారు. ఇళ్లలో ఉన్న మహిళలు ఏం జరుగుతుందోన్న ఆందోళనతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. 50 కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో భూకంపం తాకిడికి 20 ఇళ్లలో గోడలు బీటలు వారాయి. భయాందోళనలతో గ్రామస్తులు చాలాసేపు ఇళ్లలోకి వెళ్లకుండా బయటే ఉండిపోయారు. మారుమూల గ్రామం కావడంతో రాత్రి వరకు ఆ గ్రామానికి అధికారులు ఎవరూ వెళ్లలేదు.