lingala ganapuram
-
డబ్బులు జేబులో పెట్టుకొని సామాను సర్దుకోమన్నారు.. కిందకు వంగడంతో..
లింగాలఘణపురం (ములుగు): లింగాలఘణపురం మండల కేంద్రానికి చెందిన కిరాణ వ్యాపారిని తనిఖీ చేస్తున్నట్లు చేసి రూ.2 లక్షలు మాయం చేసి ఉడాయించారు. ఈ ఘటన వరంగల్– హైదరాబాద్ జాతీయ రహదారిపై జెర్సీ పాలకేంద్రం సమీపంలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు జరిగింది. ఘటనకు సంబంధించి బాధితుడు కొడితాల శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. జెర్సీ పాలకేంద్రం సమీపంలో ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్లో శేఖర్ బంధువు ప్లాటు కొనుగోలు చేయగా అతనికి ఇవ్వాల్సిన రూ.2 లక్షలతో పాటు కిరాణం సామాను కోసం మరో రూ.7వేలు తీసుకుని ఎక్సెల్ వాహనంపై జనగామకు బయలు దేరాడు. (చదవండి: వైరల్: యమ ‘స్పీడ్’గా వెళ్తున్న కామారెడ్డి కలెక్టర్ వాహనం.. ఏకంగా రూ.27,580 చలాన్లు!) నెల్లుట్ల బైపాస్ నుంచి సదరు వెంచర్ వద్దకు వెళ్లేందుకు యశ్వంతాపూర్ సమీపంలో ఉన్న బస్టాప్ వద్ద ఆగి బంధువుకు ఫోన్ చేశాడు. అతను కూడా వస్తున్నానని చెప్పడంతో వెంచర్ వద్దకు వెళ్తున్నాడు. అప్పటికే బస్టాప్ వద్ద బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అతని ముందుకు వెళ్లి అడ్డంగా బైక్ ఆపారు. వెంటనే ఒకరు దిగి ఫోన్ తీసుకుని, ఎక్సెల్ తాళం చెవి తీసుకున్నాడు. పెట్రోల్ పంపులో ఎవరిని కలిశావు.. ఏదో ఇచ్చావంటూ బుకాయించారు. నేను బంక్‌లోకి వెళ్లలేదని, ఎవరిని కలువలేదని చెబుతుండగానే సంచిలో ఏం ఉన్నాయి బయటకు తీయాలని ఆదేశించారు. సంచి తీయగానే జేబులో ఏం ఉన్నాయని గద్దించారు. డబ్బులు ఉన్నాయని చెప్పి చూపించగా డబ్బులు జేబులో పెట్టుకొని సంచిలో సామాను సర్దుకోమని చెప్పారు. వంగి సామాను సర్దుకుంటుండగానే జేబులోని డబ్బులు మాయం చేసి ఎక్సెల్ తాళం చెవితో బైక్‌పై పరారయ్యారు. సంచి సర్దుకుని జేబులో డబ్బులు చూసుకోగానే లేకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. అప్పటికే తన బంధువు అక్కడికి రావడంతో ఇద్దరూ కలిసి సదరు వ్యక్తులను వెంబడించే ప్రయత్నం చేశారు. నిడిగొండ వరకు వెళ్లి రఘునాథపల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ పరిధి తమకు లేదని, జనగామకు వెళ్లాలని సూచించగా అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేశారు. సీఐ బాలాజీవరప్రసాద్ ఘటన స్థలానికి చేరుకుని జరిగిన ఘటనపై ఆరా తీశారు. (చదవండి: కూరలు కుతకుత.. టమాటా ఒకటే అనుకుంటే పొరపాటే.. ఈ పట్టిక చూడండి) -
ఎంటెక్ విద్యార్థిని ఆత్మహత్య
* పెళ్లి చేసుకోవాలని మృగాడి వేధింపులు.. లింగాలఘణపురం: ప్రేమించానని, పెళ్లి చేసుకోవాలని ఓ మృగాడు వేధిస్తుండడంతో తాళలేని ఎంటెక్ విద్యార్థిని మరణశాసనం రాసుకుంది. తనతో తీయించుకున్న ఫొటోలు చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేయడంతో మనోవేదనకు గురై మంగళవారం ఉదయం క్రిమిసంహారక మందు తాగింది. వివరాలు పోలీసుల కథనం ప్రకారం... వరంగల్ జిల్లా లింగాల ఘనపురం మండలం వడిచర్ల గ్రామానికి చెందిన వంగ ఉప్పలయ్య- పద్మల కుమార్తె విజయలక్ష్మి (23) అలియాస్ విజయ జనగామలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలో ఎంటెక్ సెకండియర్ చదువుతోంది. అదే కళాశాలలో ఎంటెక్ పూర్తి చేసిన దేవరుప్పుల వాసి గొడిశాల రజినీకర్ చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం ఇప్పిస్తానని విజయలక్ష్మి వద్ద అప్పట్లో పాస్‌పోర్టు సైజు ఫొటోలతో పాటు ఆమె మిత్రులతో కలిసి తీయించుకున్న ఫొటోలు తీసుకున్నాడు. అప్పటి నుంచి విజయలక్ష్మిని పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ తన వద్ద ఉన్న ఫొటోలను కుటుంబ సభ్యులకు చూపిస్తానని బెదిరిస్తున్నాడు. పెళ్లికి తన కుటుంబ సభ్యులు అంగీకరించరని విజయలక్ష్మి వ్యతిరేకించింది. తాను ‘మీ కుటుంబ సభ్యులను ఒప్పిస్తానని’ ఒత్తిడి చే స్తుండడంతో మనోవేదనకు గురైంది. ఈ నెల 13న హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్న తన తమ్ముడు వినోద్‌కు ఫోన్ చేసి తనను రజినీకర్ పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడని వాపోయింది. మరుసటిరోజే మంగళవారం ఉదయం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. రజినీకర్ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసి పెట్టింది. తమ కూతురు ఆత్మహత్యకు రజినీకర్ వేధింపులే కారణమని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూసైడ్ నోట్ ‘తనను ఓ యువకుడు వేధిస్తున్నాడు, ఉద్యోగం ఇప్పిస్తానని తన వద్ద ఫొటోలు, రెజ్యూమ్ తీసుకుని వెంటబడుతున్నాడు. తాను జీవితంలో చేసిన తప్పు ఆ యువకుడితో మాట్లాడడమే, నాన్న అమ్మను మంచిగా చూసుకో, తమ్ముడూ మంచిగా చదువుకుని ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నను చూడు. తాత ఆరోగ్యం కోసం కూడా చూడండి. మీతో ఉండాలని ఉంది. అయినా.. మిమ్ములను మిస్సవుతున్నందుకు బాధగా ఉంది’ అని సూసైడ్ నోట్లో రాసింది.