liquor king
-
మద్యం బ్రాండ్లు..అసలు నిజాలు.. రాష్ట్రానికి లిక్కర్ కింగ్ చంద్రబాబే..!
40 ఏళ్ల అనుభవం అంటూ తరచుగా చెప్పుకునే చంద్రబాబు.. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యంలో కొత్త ఒరవడులు తెచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 20 డిస్టిలరీలకుగానూ ఏకంగా 14 డిస్టీలరీలకు అనుమతి ఇచ్చింది చంద్రబాబే. అయినా.. వీటన్నింటిని మరిచి ఈ మధ్య మళ్లీ మద్యం పాట పాడుతున్నారు చంద్రబాబు. మనసుకు నిజం తెలిసినా.. ఆయన నోటి నుంచి అబద్దాలే వస్తున్నాయి. ఎక్కడా లేని బ్రాండ్లు ఏపీలో ఉన్నాయంటూ ప్రచారంలో ప్రజలకు చెప్పుకొస్తున్నారు. కొత్త బ్రాండ్లతో నాసిరకం మద్యం అమ్ముతున్నారని తెగ జాలి ప్రదర్శిస్తున్న చంద్రబాబు.. లిక్కర్ షాపుల్లో డిజిటల్ పేమేంట్లు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ చంద్రబాబు వాదనలో నిజమెంత ఉంది? ఒక సారి కింది ట్యాలీని పరిశీలిద్దాం. మార్చిలో జరిగిన శాసనసభ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దీనిపై పూర్తి స్పష్టత ఇచ్చారు. "నవరత్నాలు, అమ్మ ఒడి.. ఇవీ మా ప్రభుత్వం చేపట్టిక సంక్షేమ కార్యక్రమాలు, ఇవే మా ప్రభుత్వ బ్రాండ్లు. అయితే చంద్రబాబు బ్రాండ్ లిక్కర్లో ఉంది. ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ ఛాయిస్ భూంభూం బీర్, పవర్ స్టార్ 999, 999 లెజెండ్.. బ్రాండ్లన్నీ చంద్రన్న కానుకలే. ఇవన్నీ చంద్రబాబు ఆశీస్సులతో వచ్చిన బ్రాండ్లే. ప్రెసిడెంట్ మెడల్ బ్రాండ్.. చంద్రబాబు మెడల్ బ్రాండ్. గవర్నర్ ఛాయిస్ 2018, నవంబర్ 5న అనుమతి ఇచ్చింది చంద్రబాబే. ఆయన దిగిపోయే చివరి క్షణం వరకు లిక్కర్ బ్రాండ్లకు అనుమతులు ఇస్తూనే ఉన్నారు. చంద్రబాబు హయాంలోనే 254 బ్రాండ్లు వచ్చాయి. ఇవన్నీ చంద్రబాబు ట్రేడ్ మార్క్ బ్రాండ్లు" చేసిందంతా చేసి.. ఇప్పుడు బ్రాండ్ల గురించి మళ్లీ ప్రజల ముందు ప్రస్తావిస్తున్నారు చంద్రబాబు. ఎల్లోమీడియాను అడ్డుపెట్టుకుని ఎంత ఘనంగా ప్రచారం చేసినా మాకంత తెలుసులే అనుకుంటున్నారు జనం. చదవండి: మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో మూడో రోజు విస్తృత సోదాలు.. -
విజయ్ మాల్యా అరెస్టు
-
విజయ్ మాల్యా అరెస్టు
స్వదేశంలో బ్యాంకులకు వేలాది కోట్ల రుణాలు ఎగవేసి లండన్ వెళ్లిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను లండన్‌లో పోలీసులు అరెస్టు చేశారు. స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు ఆయనను అక్కడ అరెస్టు చేశారు. గత కొంత కాలంగా లండన్‌లోనే ఉంటున్న మాల్యాపై స్వదేశంలో పలు కేసులు ఉన్నాయి. ప్రధానంగా 9వేల కోట్ల రుణాల ఎగవేత కేసులో మాల్యా నిందితుడు. త్వరలోనే ఆయనను యూకే కోర్టులో ప్రవేశపెడతారు. ఆ తర్వాత నేరగాళ్ల అప్పగింత ఒప్పందం కింద లండన్ నుంచి మాల్యాను భారతదేశానికి తీసుకొచ్చే అవకాశం ఉంది. స్టేట్‌బ్యాంకు నేతృత్వంలోని కన్సార్షియంకు మొత్తం రూ. 9వేల కోట్లకు పైగా రుణాలు చెల్లించకుండా ఎగవేసిన లిక్కర్ కింగ్ మాల్యా.. గత సంవత్సరం మార్చి 2వ తేదీన రాత్రికి రాత్రి లండన్ పారిపోయారు. మొత్తం 17 బ్యాంకులకు ఆయన రుణాలు ఎగవేసినట్లు చెబుతున్నారు. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత, యూబీ గ్రూప్ చైర్మన్ అయిన విజయ్ మాల్యా గతంలో రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. భారత హై కమిషన్ ఒక పిటిషన్ దాఖలు చేయడంతో లండన్ కోర్టు విచారణ జరిపి, వారంటు ఇచ్చిన తర్వాత స్కాట్లాండ్ యార్డు పోలీసులు ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం. -
విజయ్ మాల్యా ఇప్పటికే జంప్?
విజయ్ మాల్యా దేశాన్ని విడిచిపెట్టి వెళ్లకుండా చూడాలంటూ స్టేట్ బ్యాంకు ఆధ్వర్యంలో 13 బ్యాంకులు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సుప్రీంలో దానిపై విచారణ కూడా బుధవారం కొనసాగాల్సి ఉంది. కానీ.. జాతీయ మీడియా కథనం నిజమైతే, మాల్యా ఇప్పటికే దేశం దాటి వెళ్లిపోయారు!! తనకు సురక్షితంగా ఉండే వేరే దేశంలో తలదాచుకున్నారు. మాల్యా దాదాపు 9వేల కోట్ల వరకు బాకీ ఉన్నారని, అందువల్ల ఆయన వేరే దేశానికి వెళ్లకుండా చూడాలని బ్యాంకులు కోరాయి. తాను లండన్‌లో సెటిల్ అవుతానని ఇటీవలే మాల్యా చెప్పారు. అయితే, ఆయన తరఫు అధికార ప్రతినిధి మాత్రం.. మాల్యా ఎక్కడున్నారో తెలియదని, కేవలం ఈ మెయిల్స్ ద్వారానే తమకు అందుబాటులో ఉన్నారని చెబుతున్నారు. యునైటెడ్ స్పిరిట్స్ నుంచి వైదొలగినందుకు మాల్యాకు మరో లిక్కర్ కంపెనీ డియాజియో ఇచ్చిన రూ. 515 కోట్లను ఖర్చుపెట్టేందుకు వీల్లేదని డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) ఆదేశించింది గానీ, ఆయన పాస్‌పోర్టును సీజ్ చేసేందుకు మాత్రం అనుమతించలేదు. ఆ సొమ్ముతోనే ఆయన లండన్‌లో స్థిరపడాలనుకుంటున్నారని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ద్వారా బ్యాంకులు సుప్రీంకోర్టుకు తెలిపాయి. బ్యాంకులు కర్ణాటక హైకోర్టుకు కూడా వెళ్లినా, అక్కడి నుంచి కూడా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు రాలేదు.