liquour
-
Liquor Sales: తెలంగాణలో లిక్కర్ సేల్స్ రికార్డుల మోత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రికార్డ్ స్థాయిలో లిక్కర్ అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్‌శాఖ తెలిపింది. డిసెంబర్ నెలలోనే తెలంగాలో అత్యధిక విక్రయాలు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే రూ.171 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. గత ఐదు వ్యవధిలోనేనే రూ.902 కోట్ల మద్యాన్ని మందుబాబులు స్వాహా చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా డిసెంబర్ నెలలో 3,435 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గత సంవత్సరం డిసెంబర్లో 2,764 కోట్ల అమ్మకాలు జరిగాయి. 2020లో 25,602కోట్ల అమ్మకాలు జరగ్గా.. 2021 శుక్రవారం సాయంత్రానికే 30,196 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి. రంగారెడ్డి జిల్లాలో 6,970 కోట్లు, నల్గొండ జిల్లాలో 3288 కోట్లు, హైదరాబాద్‌లో 3,201 కోట్ల అమ్మకాలు నమోదయినట్లు ఎక్సైజ్‌శాఖ వెల్లడించింది. చదవండి: (కేకలు, అరుపులు.. జూబ్లీహిల్స్‌లో యువతి హల్చల్) -
మందుబాబులకు బ్యాడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బెల్టు షాపులు వెంటనే మూసివేసేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి ఆదేశించారు. ఈ నెల 29న సాయంత్రం 6 గంటల నుంచి డిసెంబర్ ఒకటిన పోలింగ్ ముగిసేవరకు గ్రేటర్ పరిధిలో మద్యం షాపులు మూసేయించాలన్నారు. డిసెంబర్ 4న కౌంటింగ్ సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో మద్యం షాపులు మూసివుంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా పార్థసారథి మాట్లాడారు. 3,133 మందిపై బైండోవర్ కేసులు జీహెచ్ఎంసీ ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి ఇప్పటిదాకా 65,098 ప్రచార బ్యానర్లు, పోస్టర్లు, బోర్డులు, ఫ్లెక్సీలు, జెండాలు తొలగించినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) వెల్లడించింది. ఇప్పటివరకు 3,133 మందిపై బైండోవర్ కేసులు పెట్టినట్టు తెలిపింది. 243 నాన్‌బెయిలబుల్ వారంట్లను అమలుచేయగా, ఇంకా 1,549 వారంట్లు పెండింగ్‌లో ఉన్నాయని, బుధవారందాకా దాదాపు రూ.1.41 కోట్ల నగదును, రూ.11 లక్షల పైచిలుకు విలువ చేసే మెఫెగ్రోన్ డ్రగ్, విడిగాంజా, మద్యం, ఐఎంఎఫ్ఎల్, మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది. గ్రేటర్ బరిలో 49 మంది నేరచరితులు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పలు డివిజన్లలో కార్పొరేటర్లుగా పోటీ చేస్తోన్న ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో మొత్తం 49 మంది నేరచరితులు ఉన్నారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) తెలిపింది. టీఆర్ఎస్లో 13 మంది, బీజేపీలో 17 మంది, కాంగ్రెస్‌లో 12 మంది, ఎంఐఎంలో ఏడుగురిపై మొత్తం 96 కేసులు ఉన్నాయని వివరిస్తూ బుధవారం ప్రకటన విడుదల చేసింది. వీరిలో ఆరుగురు మహిళా అభ్యర్థులపైనా కేసులు ఉండటం గమనార్హం. వీరంతా 41 వార్డుల్లో పోటీ చేస్తున్నారని పేర్కొంది. మల్కాజిగిరి వార్డు (147)లో పోటీ చేస్తోన్న అభ్యర్థులందరికీ నేరచరిత ఉందని ఎఫ్‌జీజీ కార్యదర్శి పద్మనాభరెడ్డి వివరించారు. గత ఎన్నికల్లో 72 మంది నేరచరితులు పోటీ చేయగా, ఈసారి ఆ సంఖ్య 49కు తగ్గిందన్నారు. ప్రజల కోసం పాటుపడేవారికి ఓటు వేయాలని ఎఫ్‌జీజీ కోరింది. చదవండి: సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్న వారిపైన కేసులు: డీజీపీ -
మద్యం మాఫియాకు చెక్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో దశల వారీగా మద్య నిషేధం దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రణాళికాబద్ధ కార్యచరణకు ఉపక్రమించారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘మద్య నియంత్రణ చట్ట సవరణ’ బిల్లును రాష్ట్ర శాసనసభ బుధవారం ఆమోదించింది. మద్యం దుకాణాల లైసెన్సులు, మద్య నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యల కోసం ఈ బిల్లును రూపొందించారు. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించేలా ‘ఏపీ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఫారిన్ లిక్కర్ యాక్ట్–1993ను సవరిస్తూ మంగళవారం ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టగా, బుధవారం కూలంకుషంగా చర్చించిన అనంతరం ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకే.. : ఈ బిల్లును శాసనసభ ఆమోదించడంతో రాష్ట్రంలో దశల వారీగా మద్య నిషేధం దిశగా అడుగు ముందుడుగు పడింది. ప్రస్తుతం మద్యం వ్యాపారం పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంది. దాంతో వారు లైసెన్స్ షరతులను యథేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. నిర్ణీత సమయాలతో నిమిత్తం లేకుండా మద్యం విక్రయిస్తున్నారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్ముతూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఇష్టానుసారంగా బెల్డ్ షాపులు నిర్వహిస్తూ సామాజిక భద్రతకు భంగం కలిగిస్తున్నారు. ప్రజల ఆరోగ్యం క్షీణించడంతోపాటు విలువైన మానవ వనరులను నష్టపోవాల్సి వస్తోంది. పేదల కుటుంబాల్లో మద్యం చిచ్చుపెడుతోంది. మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి. దాంతో ప్రజల నుంచి.. ముఖ్యంగా మహిళల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయమై మహిళలు కొన్నేళ్లుగా ధర్నాలు చేస్తున్నారు. తన పాదయాత్రలో ఈ పరిస్థితులను గుర్తించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారు. దశల వారీగా మద్యం నిషేధమే ఈ సమస్యకు పరిష్కారమని భావించారు. ప్రభుత్వ ఆదాయం కోల్పోయినా పర్వాలేదు ప్రజల బతుకులు బాగు పడాలనే ఉద్దేశంతోనే మేనిఫెస్టోలో దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకుంటూ అధికారంలోకి రాగానే బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపారు. ఇప్పుడు తాజాగా మద్య నియంత్రణ చట్టం సవరణ కోసం శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు లక్ష్యాలు, ఉద్దేశాలను ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి సభకు వివరించారు. అనంతరం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ బిల్లును సమర్థిస్తూ ప్రసంగించారు. పేదలు, మహిళల జీవితాలను బాగు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. అనంతరం ఈ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. మద్యం పీడ వదిలించడానికే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓ సామాజిక వేత్తగా, ఓ తత్వవేత్తగా ఆలోచించి మద్యం మహమ్మారి పీడ వదిలించడానికి ఈ బిల్లును తీసుకువచ్చారు. మద్యం.. ఆడపడుచుల గుండెకు చేసిన గాయాన్ని నయం చేయడానికి సీఎం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలు మద్యం అమ్మకాలను తమ ఆదాయ వనరుగా భావించడం దురదృష్టకరం. మద్యం అమ్మకాలతో ప్రభుత్వ ఆదాయం పెరుగుతోంది. కానీ విలువైన మానవ వనరులు, సామాజిక సంపద తరిగిపోతోంది. మద్యం పేదల జీవితాలను కబళించివేస్తోంది. మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి. నేరాలు పెరిగిపోతున్నాయి. ఓదార్పు యాత్ర, ప్రజా సంకల్ప యాత్ర ద్వారా పేద మహిళల కష్టాలను చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్యం రక్కసి అంతు చూడటానికి మొదటి అడుగుగా ఈ బిల్లును తీసుకువచ్చారు. అందుకే ఆయనకు ఈ రాష్ట్ర ఆడపడుచుల తరపున కృతజ్ఞతలు. – భూమన కరుణాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే, తిరుపతి మూల కారకుడు చంద్రబాబే : రోజా ‘పేదల జీవితాలను నాశనం చేస్తున్న మద్యం మహమ్మారిని రూపు మాపడానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారానే మద్యం దుకాణాలు నిర్వహించేలా చట్ట సవరణ తేవడం సంతోషకరం. ఎందుకంటే ప్రైవేటు షాపుల యజమానులు బెల్డ్ షాపులు పెట్టి దోచుకుంటున్నారు. దీనికి చంద్రబాబే మూల కారకుడు. ఆయన ప్రభుత్వం ఐదేళ్లలో రూ.75 వేల కోట్ల విలువైన మద్యాన్ని ఏరులై పారించింది. 40 వేల బెల్డ్ షాపులు ఏర్పాటు చేసింది. కానీ 4 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసింది. అదీ చంద్రబాబు ప్రభుత్వ విధానం. కానీ మన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్యాన్ని దశల వారీగా నిషేధించాలని నిర్ణయించుకున్నారు. అదీ ఆయన నిబద్దత’ అని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. మద్యం మాఫియాను పెంచి పోషించింది చంద్రబాబు ప్రభుత్వమేనని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పేర్కొన్నారు. మద్యం మాఫియాను అంతం చేసేందుకు సీఎం జగన్ గొప్ప బిల్లు తీసుకువచ్చారని కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ కొనియాడారు. -
వారి కన్నీళ్లు తుడుస్తానని మాటిచ్చాను..
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో దశల వారీగా మద్య నిషేధం దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రణాళికాబద్ధ కార్యచరణకు ఉపక్రమించారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘మద్య నియంత్రణ చట్ట సవరణ’ బిల్లును రాష్ట్ర శాసనసభ బుధవారం ఆమోదించింది. మద్య నిషేదం దిశగా అడుగులేయడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ‘మద్యంతో మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయని, అక్కచెల్లెమ్మల కన్నీళ్లు తుడుస్తానని మాట ఇచ్చాను. నిషేధం దిశగా అడుగులేస్తూ బెల్టుషాపుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. మద్యం అమ్మకాల బాధ్యతను ప్రభుత్వానికే అప్పగిస్తూ చట్టాన్ని తెచ్చాం. తద్వారా గ్రామాల్లో బెల్టుషాపులు పూర్తిగా మూతబడతాయి’ అని ట్విటర్లో పేర్కొన్నారు. (చదవండి : మద్యం మాఫియాకు చెక్) -
మద్యం మత్తులో రెచ్చిపోయిన యువకులు
ముగ్గురిపై దాడి మహానాడు (తాడేపల్లి రూరల్) : తాడేపల్లి పట్టణ పరిధిలోని మహానాడులో మద్యం మత్తులో నలుగురు యువకులు స్థానికులపై దాడి చేసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం... శ్రీనివాస్ అనే విద్యార్థి విజయవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. గత రాత్రి తన ద్విచక్ర వాహనంపై విజయవాడ వెళ్తుండగా ఎదురుగా రెండు వాహనాలపై వచ్చిన నలుగురు వ్యక్తులు ‘అన్న వస్తుంటే తప్పుకోవడం తెలియదా..’ అంటూ బండి దిగి దాడి చేసి, తన వాహనాన్ని ధ్వంసం చేసినట్టు విద్యార్థి శ్రీనివాస్ తెలిపాడు. తర్వాత వారెవరని ఇంట్లోని పెద్దలు విచారిస్తే, కళ్యాణ్, కింటు, కిరణ్‌గా ముగ్గురిని గుర్తించారు. మరో యువకుడు ఎవరో తెలియదని శ్రీనివాస్ చెప్పాడు. ఘటనపై తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఆ నలుగురు యువకులే మద్యం మత్తులో ఓ వృద్ధుడిని, మరో యువకుడిని కూడా చితకబాదినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు.